Aishwarya Rajesh: కాస్త శృతిమించినా ఓవర్ డోస్ అయిపోతుంది.. నాకు పదిరోజులు పట్టింది
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:19 PM
నేను ఎయిర్ పోర్ట్‌లో కనిపిస్తే ప్రతి ఒక్కరూ నాతో ఫోటో తీసుకుంటున్నారు.. అది ‘గోదారి గట్టు’ పాటకి వచ్చిన రీచ్ అని అన్నారు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. విక్టరీ వెంకటేష్ సరసన ఆమె హీరోయిన్గా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. జనవరి 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాల గురించి ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సెన్సేషనల్ హిట్‌గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. అలాగే సినిమా ట్రైలర్ కూడా సినిమాపై భారీగా అంచనాలని పెంచేసింది. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ..
‘సుడల్ వెబ్ సిరీస్ షూటింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్‌కి లుక్ టెస్ట్ చేయాలని అన్నారు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆయన సినిమాలన్నీ చూశాను. ఇందులో నా పాత్రకి ఒక యాస వుంది. ఆ యాసతో పాటు ఆ లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ డైలాగ్ ఇచ్చారు. రెండు లైన్స్ చెప్పగానే చాలని చెప్పి స్క్రిప్ట్‌ని నెరేట్ చేశారు. నెరేషన్లో పడిపడి నవ్వుకున్నాను. నా కెరీర్లో ఇంత ఎంజాయ్ చేసి విన్న స్క్రిప్ట్ ఇదే అని చెప్పగలను. భాగ్యం క్యారెక్టర్ కోసం చాలా మందిని వెదికారు. ఆ పాత్ర నాకు దక్కడం ఆనందంగా వుంది. ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాను. ‘సంక్రాంతికి వస్తున్నాం’ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ‘గోదారి గట్టు మీద’ పాట అందరికీ రీచ్ అయ్యింది. నేను ఎయిర్ పోర్ట్‌లో కనిపిస్తే ప్రతి ఒక్కరూ నాతో ఫోటో తీసుకుంటున్నారు. అది ఆ పాటకి వచ్చిన రీచ్. ఆ సాంగ్ ఒక వైల్డ్ ఫైర్‌లా పాకింది.
Also Read- Kabir Duhan Singh: పేరుకే విలన్.. ఈ నటుడు చేసేది తెలిస్తే ఫ్యాన్ అయిపోతారు
తెలుగులో నాకు ఇప్పటివరకూ సరైన డ్యూయెట్ సాంగ్ పడలేదు. ఆ లోటు ‘గోదారి గట్టు మీద’ పాటతో తీరింది. వెంకటేష్ గారు లాంటి బిగ్ హీరోతో ఇంత అద్భుతమైన సాంగ్ చేయడం అది ఇంత వైరల్ హిట్ కావడం ఆనందంగా వుంది. అలాగే సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. పాటలు హిట్ అయితే సగం పాసైపోయినట్లే. ట్రైలర్ ఆ అంచనాలని మరింతగా పెంచింది. ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా. ముఖ్యంగా వెంకీగారితో బిగినింగ్‌లో చాలా భయం వేసింది. ఎందుకంటే భాగ్యం.. మామూలు క్యారెక్టర్ కాదు. కత్తిమీద సాములాంటి క్యారెక్టర్. కొంచెం బ్యాలెన్స్ తప్పినా కష్టమే. ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ప్రేక్షకులు చూస్తున్నప్పుడు జాలి పుట్టించే క్యారెక్టర్. చాలా క్రూసియాల్ రోల్. కాస్త శ్రుతిమించిన ఓవర్ డోస్ అయిపోతుంది. భాగ్యం పాత్రని అర్థం చేసుకోవడానికి నాకు పదిరోజులు పట్టింది. భాగ్యం లాంటి క్యారెక్టర్ ఐదారేళ్ళుగా తెలుగు సినిమాల్లో చూడలేదు. చాలా ఫ్రెష్ రోల్. ఇలాంటి ఫ్యామిలీ ఫీల్ గుడ్ సినిమా వచ్చి చాలా రోజులైయింది. అందరూ కనెక్ట్ చేసుకునే సినిమా ఇది. అనిల్ గారు చాలా క్రియేటివ్‌గా ఈ కథని చెప్పారు.
వెంకీగారి ఎమోషన్స్ అన్నీ నేచురల్‌గా వుంటాయి. ఆయన టైమింగ్ అద్భుతం. ఆయనతో కలిసి యాక్ట్ చేయడం మామూలు విషయం కాదు. అయితే ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. భాగ్యం పాత్రలో అదరగొడుతున్నావ్ అని మెచ్చుకునే వారు. కానీ డైలాగులు ఇచ్చేటప్పుడు టెన్షన్ వచ్చేసేది. చేతులు వణికేవి. ఒకసారి ఫీవర్ కూడా వచ్చింది. వెంకీ, అనిల్ గార్ల సపోర్ట్ మర్చిపోలేను. వెంకీగారు చాలా పాజిటివ్‌గా వుంటారు. వండర్ ఫుల్ పర్సన్. అలాగే మీనాక్షి చాలా సింపుల్. తనకి నాకు దగ్గర పోలికలున్నాయి. డాక్టర్ చదువుకుంది. కష్టపడి పైకి వచ్చింది. తను చాలా స్వీట్. తనకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మీను సాంగ్‌లో తప్పితే.. వెంకటేష్‌గారు, నేను, మీనాక్షి.. ముగ్గురం సినిమా అంతా ట్రావెల్ అవుతాం. మా ముగ్గురిని చూడాల్సిందే. ఇందులో వెంకీగారిది మా ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్. దిల్ రాజు, శిరీష్ గారి బ్యానర్లో వర్క్ చేయడం నైస్ ఎక్స్పీరియన్స్.
సినిమాలలో చేసే అవకాశం అందరికీ రాదు. అదొక అదృష్టం. భిన్నమైన కథలు చెప్పడానికి సినిమా అనేది గొప్ప వేదిక. నా వరకూ డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. ఏ పాత్ర చేసినా సోషల్ రెస్పాన్స్‌బిలిటీ వుండాలని కోరుకుంటాను..’’ అని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చారు.