Kamal Haasan: పెళ్ళి వేడుకల్లో మారుమ్రోగేలా జింగుచా సాంగ్....
ABN, Publish Date - Apr 18 , 2025 | 05:30 PM
మణిరత్నంలో కమల్ హాసన్ నటిస్తున్న సినిమా 'థగ్ లైఫ్'. ఈ మూవీని మణిరత్నం, కమల్ ఇద్దరూ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన 'థగ్ లైఫ్' (Thug Life) నుంచి మొదటి సింగిల్ ‘జింగుచా’ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శింబు (Silambarasan), త్రిష కృష్ణన్ (Trisha Krishnan), ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాసర్, అలీ ఫజల్, సన్యా మల్హోత్రా వంటి వారు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ లాంచ్ కోసం నిర్వహించిన ఈవెంట్‌తో దేశం మొత్తం 'థగ్ లైఫ్' వైపు చూసింది. ఈ వేడుకల్లో కమల్ హాసన్, మణిరత్నం, ఎ. ఆర్. రెహమాన్ (A. R. Rahman) పాల్గొని సందడి చేశారు. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ‘జింగుచా’ అనే ఫస్ట్ సింగిల్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ పాటకు కమల్ హాసన్ సాహిత్యాన్ని అందించగా, రెహమాన్ బాణీలు సమకూర్చారు.
Also Read: Samantha: సమంత శుభం పలికేది ఎప్పుడంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి