Mohan Lal: టాక్సీ డ్రైవర్ గా మోహన్ లాల్....
ABN, Publish Date - Apr 08 , 2025 | 10:58 AM
ప్రముఖ నటుడు మోహన్ లాల్ వీలైనంత వరకూ వివాదాలకు దూరంగానే ఉంటారు. ఎంపురాన్ విషయంలోనూ జరిగిన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పిన ఆయన తన మరో చిత్రానికి మూవ్ ఆన్ అయిపోయారు. మోహన్ లాల్ తాజా చిత్రం 'తుడరమ్' ఏప్రిల్ 25న విడుదల కాబోతోంది.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) నిజానికి క్షణం తీరకలేకుండా ఉంటారు. 64 సంవత్సరాల వయసులోనూ ఆయన సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నారు. ఈ మధ్యే తొలిసారి మోహన్ లాల్ మెగా ఫోన్ చేతపట్టుకుని 'బరోజ్' చిత్రాన్ని రూపొందించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన సినిమాలు నాన్ స్టాప్ గా చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ చేసిన 'ఎల్ 2: ఎంపురాన్' (L2: Empuraan) మూవీ వివాదాస్పదమైంది. ఈ సినిమాలో జాతీయ పార్టీ బీజేపీని, హిందుత్వ వాదులను విమర్శించే సంఘటనలు, సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయని కొందరు ఆగ్రహించారు. దాంతో రీ-సెన్సార్ చేయాల్సిందిగా ఫిల్మ్ మేకర్స్ కోరి, స్వచ్ఛందంగానూ కొన్ని సన్నివేశాలను తొలగించారు. అయినా... ఈ సినిమా నిర్మాత గోకులం గోపాలన్ పై ఈడీ దాడులు జరిగాయి. అలానే గతంలో కొన్ని సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ కు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజుల్లోనే మోహన్ లాల్ జరిగిన తప్పును గ్రహించి. దిద్దుబాటు చర్యల్లో భాగంగా చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెప్పారు.
ఇదిలా ఉంటే... 'ఎల్ 2: ఎంపురాన్' చివరిలో చూపించిన విధంగా 'ఎల్ 3: ది బిగినింగ్' ఉంటుందా లేదా అనే ప్రశ్న ఒకటి ఉదయించింది. నిజానికి ఆ సినిమాను మోహన్ లాల్ కొడుకు తో పృథ్వీరాజ్ ప్లాన్ చేశాడని మలయాళ చిత్రసీమలో వార్తలు వచ్చాయి. ఆ సినిమా సంగతి పక్కన పెడితే... మోహన్ లాల్ మాత్రం 'ఎంపురాన్' వివాదం నుండి మూవ్ ఆన్ అయిపోయారు. ఆయన తన కొత్త సినిమా రిలీజ్ పై దృష్టి పెట్టారు. అదే 'తుడరమ్'. ప్రముఖ నటి శోభన చాలా యేళ్ళ తర్వాత మరోసారి మోహన్ లాల్ తో ఈ సినిమాలో జోడీ కట్టింది. స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో టాక్సీ డ్రైవర్ షణ్ముగంగా నటిస్తున్నాడు. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని తరుణ్ మూర్తి డైరెక్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా జనం ముందుకు వస్తోంది. అంటే 'ఎంపురాన్' విడుదలై నెల రోజులు కూడా పూర్తికాకముందే... 'తుడరమ్' వచ్చేస్తోందన్న మాట.
Also Read: Samyuktha: ముచ్చటగా మూడోసారి....
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి