Taapsee Pannu: 15 ఏళ్లలో తొలిసారి ఆ దర్శకుడు నన్ను ఆహ్వానించాడు

ABN, Publish Date - Jan 29 , 2025 | 07:44 AM

15 ఏళ్లలో తొలిసారి నాకు ఎంతో ఇష్టమైన దర్శకుడి సినిమా వేడుకకు ఆహ్వానం వచ్చిందని అన్నారు హీరోయిన్ తాప్సీ. తాజాగా ఆమె ‘బ్యాడ్‌గర్ల్’ అనే చిత్ర టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుక చెన్నైలో జరిగింది. మరి తాప్సీ చెబుతున్న ఆ ఇష్టమైన దర్శకుడు ఎవరు? ఏంటా కథ? అనే విషయంలోకి వస్తే..

Taapsee Pannu

బాలీవుడ్‌ దర్శక నటుడు అనురాగ్‌ కశ్యప్‌, కోలీవుడ్‌ దర్శకుడు వెట్రిమారన్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యాడ్‌గర్ల్‌’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చెన్నై నగరంలో జరిగిన వేడుకలో విడుదల చేశారు. గ్రాస్‌రూట్‌ ఫిల్మ్‌ కంపెనీ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీకి బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది స్వరాలు సమకూర్చారు. ఈయన తమిళ చిత్రానికి సంగీతం అందించడం ఇదే తొలిసారి. దర్శకుడు వెట్రిమారన్‌ వద్ద ‘వడ చెన్నై’, ‘విచారణై’ వంటి సినిమాలకు అసిస్టెంట్‌‌గా పనిచేసిన వర్షా భరత్‌ ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ‘కమింగ్‌ ఆఫ్‌ ఏజ్‌ ఫ్యామిలీ డ్రామా’గా రూపొందిన ఈ మూవీలో ప్రధాన పాత్రను అంజలి శివరామన్‌ పోషించగా.. శాంతిప్రియ, హృద్‌ హారూన్‌, టీజే అరుణాచలం, శరణ్య రవిచంద్రన్‌ తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా తుదిదశ చిత్రీకరణ జరుపుకుంటోంది.


Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!

ఈ టీజర్ లాంచ్ వేడుకకు ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.థాను, దర్శకుడు మిష్కిన్‌, హీరోయిన్‌ తాప్సీ ముఖ్య అతిథులుగా పాల్గొని టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత థాను మాట్లాడుతూ, ఒక చిత్రం విజయానికి కొత్తదనంతో కూడిన పబ్లిసిటీ ముఖ్యం. నా వంతుగా ఈ టీజర్‌ను మరింత మందికి చేరువచేస్తాను. మీడియా కూడా ఆదరించాలని కోరారు. దర్శకురాలు వర్ష మాట్లాడుతూ.. వెట్రిమారన్‌కు కథలు చెబుతూనే ఉంటాం. వాటిని ఆలకించే ఆయన ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంటారు. అలాంటి మంచి ఫీడ్‌బ్యాక్‌ ఈ స్టోరీకి ఇచ్చారు. తమిళ సంప్రదాయంలో మహిళను తల్లితో సమానంగా చూస్తారు. కానీ, ఒక మహిళలోని నిజమైన భావాలు ఏమిటో చెప్పే కథ ఇదని పేర్కొన్నారు.


హీరోయిన్‌ తాప్సీ మాట్లాడుతూ.. ‘‘15 ఏళ్లలో తొలిసారి వెట్రిమారన్‌ ఒక సినిమాకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ‘బ్యాడ్‌గర్ల్’ నాకు ఆ అవకాశం కల్పించింది. తరచూ పురుషులకు సంబంధించిన చిత్రాలే వస్తుంటాయి, మహిళలకు సంబంధించిన చిత్రాలు ఎందుకు రావడం లేదని ఆశ్చర్యపోతుంటాను. ఈ సినిమా కేవలం స్త్రీల సమస్యలను ప్రస్తావిస్తుంది. మహిళ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. దర్శకురాలు కూడా మహిళే. ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఇంకా వెట్రిమారన్‌, అనురాగ్‌ కశ్యప్‌, అంజలి శివరామన్‌, దర్శకుడు మిష్కిన్‌ తదితరులు ప్రసంగించారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.


Also Read- Anil Ravipudi: ఇండస్ట్రీలోకి రాకముందే అనిల్ ప్రేమకి సహాయం చేసిన నటులు

Also Read- Padma Bhushan Puraskar 2025: బాలయ్యతో పాటుగా పద్మ భూషణ్ పొందిన నటులెవరంటే..

Also Read- Mass Jathara Teaser: జాతర కాదు.. ర్యాంపేజ్.. ‘మనదే ఇదంతా’!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2025 | 07:44 AM