Sunil: తమిళ రాజకీయ నాయకుడిగా సునీల్..
ABN, Publish Date - Apr 26 , 2025 | 05:37 PM
హాస్యనటుడిగా కెరీర్ ప్రారభించి హీరోగానూ మంచి గుర్తింను తెచ్చుకున్నారు సునీల్ (Sunil). ఇప్పుడాయన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలపెట్టారు. వరుస చిత్రాలతో బిజీ అయ్యారు. ఓవైపు సీరియస్ పాత్రలు చేస్తూనే అవే తరహా పాత్రల్లో కామెడీని సైతం పండిస్తున్నారు. గత
హాస్యనటుడిగా కెరీర్ ప్రారభించి హీరోగానూ మంచి గుర్తింను తెచ్చుకున్నారు సునీల్ (Sunil). ఇప్పుడాయన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలపెట్టారు. వరుస చిత్రాలతో బిజీ అయ్యారు. ఓవైపు సీరియస్ పాత్రలు చేస్తూనే అవే తరహా పాత్రల్లో కామెడీని సైతం పండిస్తున్నారు. గత ఏడాదే 11 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సునీల్. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో అలరించారు. రామం రాఘవం, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో మెప్పించాడు. కొత్తగా మరికొన్ని ప్రాజెక్ట్‌లోనూ భాగమవుతున్నాడు. ఇప్పటిదాకా హాస్య నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన ఆయన ఇప్పుడు రాజకీయ పాత్రలతోనూ తనదైన ముద్ర వేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దళపతి విజయ్ కథానాయకుడిగా 'జననాయగన్’ (Jana Nayagan) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన నేప థ్యంలో చేస్తోన్న తొలి పొలిటికల్ చిత్రమిది. వచ్చే ఎన్నికల్లో పోటీని దృష్టిలో పెట్టుకుని విజయ్ ఈ తరహా చిత్రానికి పూనుకున్నాడు. ఆయనతోపాటు ఇదే సినిమాలో మరికొంత మంది రాజకీయ నాయకుల పాత్రల్లో పోషిస్తున్నారు. వారంతా తమిళ నటులే. అయితే ఓ తమిళ రాజకీయ నాయకుడి పాత్రలో నటించే అవకాశం సునీల్‌కి దక్కిందట. సినిమాలో ఆ పా?త్ర చాలా కీలకమని కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇది విజయ్‌కి ప్రత్యర్థి పాత్ర అని అంటున్నారు. సునీల్ ఆహార్యం, వైట్ అండ్ వైట్ గెటప్ ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి. తెలుగులో అయితే సునీల్ ఇలాంటి పాత్ర పోషించలేదు. ఇప్పటికే తమిళంలో సునీల్ చాలా సినిమాలు చేశాడు. జైలర్ సినిమాతో మంచి పేరొచ్చింది. అదే ఇమేజ్‌తో జననాయగన్‌లోనూ అవకాశం అందుకున్నాడని చెబుతున్నారు.