Mallika Sukumaran: ఆ సందేశం చూడగానే కన్నీళ్లు వచ్చాయి

ABN, Publish Date - Apr 07 , 2025 | 04:04 PM

మలయాళ దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు (Prithviraj Sukumaran)ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.


మలయాళ దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు (Prithviraj Sukumaran)ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన తల్లి మల్లిక (Mother Mallika) సుకుమారన్‌ స్పందించారు. తాము భయపడడం లేదని చెప్పారు. ఈ విషయంలో మమ్ముట్టి తమకు మద్దతుగా నిలిచారని అన్నారు. ‘‘నా బిడ్డ పృథ్వీ ఏ తప్పు చేయలేదు. మేం దర్యాప్తునకు సిద్థంగా ఉన్నాం. భయపడాల్సిన పని లేదు. ఈ విషయంలో మాకు మద్దతు ఇస్తోన్న వారికి కృతజ్ఞతలు. మమ్ముట్టి మాకు  ధైౖర్యాన్నిస్తున్నారు. ఆయన ప్రస్తుతం చెన్నైలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ వార్తలను చూసి ‘అన్నీ సర్దుకుంటాయి’ అని సందేశం పంపారు. ఆ సందేశం చూడగానే నాకు కన్నీళ్లు వచ్చాయి. పృథ్వీరాజ్‌ కంటే మమ్ముట్టి ఎంతో ప్రముఖుడు. అయినప్పటికీ ఆయన మాకోసం సమయం తీసుకొని మాకు  మెసేజ్  చేశారు. అది ఆయన గొప్పతనం’’ అని అన్నారు.  (Income tax Notice)

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ నటించిన ‘ఎల్‌2-ఎంపురాన్‌’ చిత్రం గత నెల 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పటినుంచి ఈ సినిమాను పలు వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఈ దర్శకుడికి ఆదాయపన్నుశాఖ ఈ-మెయిల్‌ ద్వారా నోటీసు పంపింది. అందులో నాలుగు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించినప్పుడు పొందిన ఆదాయానికి సంబంధించి వివరాలు కోరింది. దాంతోపాటు గోల్డ్‌, జనగణమన, కడువా సినిమాల్లో యాక్ట్‌ చేసిందుకు రెమ్యునరేషన్‌ తీసుకోకుండా సహ నిర్మాత అనే ప్రాతిపదికన రూ.40 కోట్ల వరకు ఆదాయం పొందారని, 29వ తేదీ లోగా ఈ మూడు సినిమాల ఆదాయం గురించి లెక్కలు సమర్పించాలని ఆదేశించింది.

Updated Date - Apr 07 , 2025 | 04:04 PM