Balan: 'మంజుమ్మెల్ బాయ్స్' డైరెక్టర్ కొత్త మూవీ.. టైటిల్ ఏంటో తెలుసా
ABN , Publish Date - Aug 18 , 2025 | 07:49 PM
గతేడాది ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన సినిమాల్లో మంజుమ్మెల్ బాయ్స్(Manjummel Boys) ఒకటి. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ తదితరులు నటించిన ఈ సినిమాకు చిదంబరం(Chidambaram S. Poduval) దర్శకత్వం వహించాడు.
Balan: గతేడాది ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన సినిమాల్లో మంజుమ్మెల్ బాయ్స్(Manjummel Boys) ఒకటి. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ తదితరులు నటించిన ఈ సినిమాకు చిదంబరం(Chidambaram S. Poduval) దర్శకత్వం వహించాడు. మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా మంజుమ్మెల్ బాయ్స్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత చిదంబరం మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా బాలన్ (Balan). ఈ సినిమాతో కేవీఎన్ ప్రొడక్షన్స్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది.
ఇక కేవీఎన్ ప్రొడక్షన్స్ తో పాటు తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా బాలన్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. తెస్పియన్ ఫిలింస్ తో కలిసి తాము ఈ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నామని, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించామని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కేవీఎన్ ప్రొడక్షన్స్ పేర్కొంది. ఇక ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, టెక్నీషియన్స్ గురించి త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో చిదంబరం ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.