Manjummel Boys: మలయాళ హిట్ చిత్రం ఓటీటీలో..
ABN , Publish Date - Apr 27 , 2024 | 02:07 PM
మలయాళ చిత్రసీమలో సంచలనం సృష్టించిన చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’. ఇటీవల విడుదలైన ఈ థ్రిల్లర్ తెలుగులోనూ మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.
మలయాళ చిత్రసీమలో సంచలనం సృష్టించిన చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel boys) ఇటీవల విడుదలైన ఈ థ్రిల్లర్ తెలుగులోనూ మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. డిస్నీ+హాట్‌స్టార్ (9Disney plus hotstar) వేదికగా మే5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2006లో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు చిదంబరం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సౌబిన్ షహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్‌భాసి, షా జార్జ్ మరియన్, లాల్ జూనియర్ కీలక పాత్రల్లో నటించారు.
కథ:
కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్ (షౌబిన్ షాహిర్), స్ఘుభాష్ (శ్రీనాథ్)తో పాటు ేస్నహితులందరూ సొంత ఊళ్లోనే చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ గ్యాంగ్‌కు మంజుమ్మల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేషన్ ఉంటుంది. వీరంతా కలిసి ఓసారి కొడైకెనాల్ టూర్‌కు వెళ్తారు. ఈ విహారయాత్రకు సుభాష్ మొదట రానని చెప్పినా కుట్టన్ బలవంతం మీద ఆఖరి నిమిషంలో కార్ ఎక్కుతాడు. మంజుమ్మల్ బ్యాచ్ కొడైకెనాల్‌లోని అందమైన ప్రదేశాలన్నీ చూశాక ఆఖరిలో గుణ కేవ్స్ చూడటానికి వెళ్తారు. ఆ గుహలు బయట నుంచి చూడటానికి ఎంత రమణీయంగా ఉంటాయో.. అంతే ప్రమాదకరం కూడా. ఎందుకంటే అక్కడ వందల అడుగుల లోతున్న ఎన్నో ప్రమాదకరమైన లోయలున్నాయి. వాటిలో డెవిల్స్ కిచెన్ కూడా ఒకటి. దాదాపు 150 అడుగులకు పైగా లోతున్న ఆ లోయలో 13మందికి పైగా పడిపోయారు.. వీరిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో తిరిగిరాలేదు. అందుకే గుణ కేవ్స్‌లోని ఆ ప్రమాదకర లోయలున్న ప్రాంతాలున్న చోటుకు వెళ్లడాన్ని అటవీశాఖ వారు.. పోలీసులు నిషేధించారు. కానీ, మంజుమ్మల్ బాయ్స్ అక్కడున్న అటవీ సిబ్బంది కళ్లుగప్పి.. ఫెన్సింగ్ దాటి గుణ కేవ్స్‌లోని ఆ ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ లోయ నుంచి సుభాష్‌ను ప్రాణాలతో కాపాడి తీసుకురావడానికి తోటి స్నేహితులంతా ఏం చేశారు? అన్నది ఈ సినిమా ఇతివృత్తం.
Keerthy Bhat: దీన స్థితిలో ఉన్నానని కూడా లేకుండా ఎక్కడెక్కడో తాకేవారు!
Read More: Tollywood, Cinema News