Drugs Case: డ్రగ్స్‌ కేసు.. ఇద్దరు మలయాళ దర్శకులు అరెస్ట్‌

ABN, Publish Date - Apr 27 , 2025 | 05:40 PM

డ్రగ్స్‌ వినియోగం (Drugs Case) ఆరోపణలతో మలయాళ చిత్రపరిశ్రమ (mollywood) కొన్నిరోజులుగా వార్తల్లో ఉన్న విషయం తెలిసింది.

డ్రగ్స్‌ వినియోగం (Drugs Case) ఆరోపణలతో మలయాళ చిత్రపరిశ్రమ (mollywood) కొన్నిరోజులుగా వార్తల్లో ఉన్న విషయం తెలిసింది. డ్రగ్స్‌ తీసుకుంటున్నారనే ఆరోపణలతో ఇప్పటికే నటుడు షైన్‌ టామ్‌ చాకోను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే! తాజాగా ఇదే పరిశ్రమకు చెందిన మరో ఇద్దరు దర్శకులను ఎక్సైజ్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. దర్శకులు ఖలీద్‌ రెహమాన్‌, అష్రఫ్‌ హంజాతోపాటు(Khalid Rahman and Ashraf Hamza) వారి స్నేహితుడు షలీఫ్‌ను కొచ్చిన్‌ ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దర్శకుల అపార్ట్‌మెంట్‌లో శనివారం అర్థరాత్రి సోదాలు నిర్వహించారు. కొద్ది మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను ఆరెస్ట్‌ చేశారు.

‘‘ఈ ముగ్గురు వ్యక్తులు కొన్నేళ్లగా గంజాయి తీసుకుంటున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. సినిమాకు సంబంధించిన చర్చల్లో భాగంగా వారంతా ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. మత్తుపదార్థాలను వారికి ఎవరు సప్లై చేస్తున్నారనే విషయంపైనా విచారణ చేస్తున్నాం’’ అని అధికారులు చెప్పారు.

Updated Date - Apr 27 , 2025 | 05:40 PM