Honey Rose: మళ్లీ రమ్మని ఆఫర్ ఇస్తున్నాడు...
ABN, Publish Date - Jan 06 , 2025 | 02:29 PM
డబ్బుందన్న అహంకారంతో ఎవరినైనా అవమానిస్తారా? దీనికి మన న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుండు అంటోంది మలయాళ బ్యూటీ హనీరోజ్.
డబ్బుందన్న అహంకారంతో ఎవరినైనా అవమానిస్తారా? దీనికి మన న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుండు అంటోంది మలయాళ బ్యూటీ హనీరోజ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
"నా పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నాడో వ్యక్తి. ఎక్కడపడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేను ఈ వేధింపుల్ని ఎందుకు సహించాలి? నాతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అతడి బిజినెస్‌కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్తూ ఉండేవాళ్లం. నన్నే టార్గెట్ చేస్తున్నాడు. కానీ అతడు తన ఇంటర్వ్యూలలో నన్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రతిసారీ నా పేరే వాడుకుంటున్నాడు. ఇలా ఒకరి గురించి ఇష్టారీతిన మాట్లాడమనేది సంస్కారం కాదు. మొదట్లో అతడి మేనేజర్లు కలిసేవారు. తర్వాత ఇతడినీ కలిశాను. అప్పుడు ఎంతో మర్యాదగా నడుచుకున్నారు. కానీ ఓ పబ్లిక్ ఈవెంట్‌లో నన్ను డబుల్ మీనింగ్‌తో పిలిచాడు. అతడి షాప్‌కు వెళ్లినప్పుడు మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు. అవి నన్నెంతో అసౌకర్యానికి గురి చేశాయి. అప్పుడు నేను మౌనంగా ఉన్నాను. కానీ ఇంటికి వెళ్లాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు కాల్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను.
అప్పటి నుంచి తన ప్రోగ్రామ్స్‌కు వెళ్లడమే మానేశాను. అయితే నేను గెస్ట్‌గా వెళ్లిన కార్యక్రమానికే అతను కూడా వచ్చాడు. ఆ విషయం నాకు తెలీదు. నాతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు కానీ అందరిముందు మళ్లీ నాపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మరోసారి తన బిజినెస్ ప్రమోషన్స్‌లో పాల్గొనమని ఆఫర్ ఇచ్చాడు. నేను కుదరదన్నారు. అతడి మేనేజర్.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను వారి ఆఫర్‌ను తిరస్కరించాను. నేను కాకపోతే మరో సెలబ్రిటీని వెతుక్కుంటానన్నాడు. అలాంటప్పుడు నేను తప్పుకున్నా పెద్ద నష్టం లేదు. హనీతో నువ్వు హోటల్ లో ఉంటున్నావా? అంటూ కొందరు అతడిని పిచ్చి ప్రశ్నలు వేసినప్పుడు తనిచ్చే జవాబు చిరాగ్గా అనిపిస్తుంది. మౌనంగా ఉంటున్నానంటే అన్నింటికీ తలాడిస్తున్నట్లు కాదు. ఇంకా ఇలాగే వేధిస్తే.. పోలీసులను ఆశ్రయిస్తాను’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
2008లో ఆలయం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హనీరోజ్ ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ తర్వాత వీరసింహారెడ్డి చిత్రంలో నటించింది. ఆ సినిమాతో ఆమె పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.