Kingston: సముద్ర తీరంలో ఓ ఊరు.. అక్కడేం జరిగింది 

ABN, Publish Date - Feb 28 , 2025 | 04:03 PM

అనగనగా ఓ ఊరు... అది సముద్ర తీరంలో ఉంది. ఆ ఊరిలో ఏదో ఉందని, ఇంకేదో జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. 'ఒకరి అత్యాశ ఈ ఊరిని నాశనం చేసింది.

జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) హీరోగా నటించిన తాజా సినిమా 'కింగ్స్టన్' (Kingston). తొలి భారతీయ సీ అడ్వెంచర్ (Sea Adventure) ఫాంటసీ సినిమాగా 'కింగ్స్టన్' తెరకెక్కింది.  కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వయంగా నిర్మించడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి (Maheswara reddy) తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7న సినిమా థియేటర్లలోకి రానుంది.‌ తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.



అనగనగా ఓ ఊరు... అది సముద్ర తీరంలో ఉంది. ఆ ఊరిలో ఏదో ఉందని, ఇంకేదో జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. 'ఒకరి అత్యాశ ఈ ఊరిని నాశనం చేసింది. మళ్ళీ నువ్వు ఆ తప్పు చేయకు' అని ఎందుకు ఒకరు చెప్పారు... సముద్రంలోకి హీరో ఎందుకు వెళ్ళాడు? ఆ తర్వాత 'ఒడ్డున ఎవరి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరి కోసం చావాలి' అని హీరో ఎందుకు చెప్పాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సముద్రంలోకి హీరో వెళ్ళినప్పుడు అతని దగ్గరకు వచ్చిన దెయ్యాల కథ ఏమిటి? అనేది ఆసక్తికరం. సముద్రంలో సాహసాలను, దెయ్యాలను, ఫాంటసీనీ కలగలిపి ఒక రకమైన ఉద్వేగాన్ని కలిగించే విధంగా ఈ సినిమా ఉంటుందనే భావాన్ని కలిగించేలా ట్రైలర్ ఉంది. 

జీవీ ప్రకాష్ కుమార్ సరసన దివ్యభారతి (Divya Bharathi) హీరోయిన్ రోల్ చేసిన ఈ సినిమాలో చేతన్, అళగన్ పెరుమాళ్, ఎలాంగో కుమార్ వేల్, రాజేష్ బాలాచంద్రన్, అరుణాచలేశ్వరన్ ఇతర ప్రధాన తారాగణం.  సినిమాటోగ్రఫీ: గోకుల్ బినోయ్, మ్యూజిక్: జీవి ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థలు: ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జి స్టూడియోస్. 

Updated Date - Feb 28 , 2025 | 04:04 PM