GV And Divya: జీవీ ప్రకాశ్, దివ్యభారతి సమ్ థింగ్ సమ్ థింగ్
ABN, Publish Date - Mar 04 , 2025 | 02:56 PM
కింగ్ స్టన్'లో హీరోయిన్ గా దివ్యభారతి (Divya Bharathi) నటిస్తోంది. దివ్యభారతి తొలి చిత్రం లో కూడా జీవీ ప్రకాశ్ హీరో. అప్పటి నుంచే ఆమెకు జీవీ ప్రకాశ్ కు మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందని... వార్తలు వినవచ్చాయి
జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar).. నిత్యం హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా (Music Director GV) బిజీగా సాగుతూనే... మరోవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఖాళీ లేనంత బిజీ షెడ్యూల్ లో కూడా వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు ఈ యంగ్ హీరో. అంతేకాదు.... సినిమాలతోనే కాదు లవ్ మ్యాటర్ తోనూ తెగ ఫేమస్ అవుతున్నాడు. ఏ ముహూర్తాన గత యేడాది విడాకుల ప్రకటన చేశాడో... అప్పటి నుంచి నెటిజన్ల ఫోకస్ అతగాడిపై పడింది. తను ఏం చేస్తున్నా..లెన్స్ వేసి మరీ వెతుకున్నారు.
'రాబిన్ హుడ్'(Robinhood) కు మ్యూజిక్ అందించిన జీవీ ప్రకాష్ హీరోగా నటించిన 'కింగ్స్టన్' (kingston)ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇప్పటి వరకు హీరోగా పలు సినిమాలు చేస్తున్నప్పటికీ గ్రాండ్ సక్సెస్ ను రుచి చూడలేకపోతున్నాడు జీవీ ప్రకాశ్. 'కింగ్ స్టన్' అతనికి నటుడిగా 25వ చిత్రం. దీంతో ఎలాగైనా సాలిడ్ హిట్ ను కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచి మీడియా ఇంటరాక్షన్ లో యాక్టివ్ గా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ హీరో తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు.
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ పోస్ట్‌తో క్లారిటీ.. మరోసారి ట్రెండింగ్‌లో...
'కింగ్ స్టన్'లో హీరోయిన్ గా దివ్యభారతి (Divya Bharathi) నటిస్తోంది. దివ్యభారతి తొలి చిత్రం లో కూడా జీవీ ప్రకాశ్ హీరో. అప్పటి నుంచే ఆమెకు జీవీ ప్రకాశ్ కు మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందని... వార్తలు వినవచ్చాయి. దివ్య భారతితో పీకల్లోతు ప్రేమలో ఉండటం వల్లే జీవీ.. తన భార్య, సింగర్ సైంధవికి విడాకులు ఇచ్చినట్లు తమిళ మీడియాలో పలు వార్తలు హల్ చల్ చేశాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో దివ్య భారతి దీనిపై క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లు మాత్రం ఆగ లేదు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని... కలిసి నటిస్తే... ప్రేమ ఉందని అర్థం కాదని క్లారిటి ఇచ్చినా కొట్టిపారేశారు నెటిజన్లు.
తాజాగా కింగ్ స్టన్ ప్రమోషన్స్ లోనూ దివ్యభారతి గురించి జీవీ ప్రకాశ్ ను మీడియా ప్రశ్నించగా... సమాధానం చెప్పకుండా దాటవేయడంతో కొత్త అనుమానాలకు తెరతీసినట్లు అయింది. తమ మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని జీవీ చెప్పి ఉంటే పుకార్లకు చెక్ పడేది. కానీ... అన్సర్ చెప్పకుండా తప్పించుకోవడంతో ఇద్దరి మధ్య లవ్ మ్యాటర్ నడుస్తూనే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విశేషం ఏమంటే... 2021లో జీవీ ప్రకాశ్ హీరోగా నటించిన 'బ్యాచిలర్' చిత్రంతోనే హీరోయిన్ గా పరిచయం అయిన దివ్యభారతి ఆ తర్వాత ఇప్పుడు 'కింగ్ స్టన్' ద్వారానే మరోసారి అదృష్టం పరీక్షించుకుంటోంది. అన్నట్టు తెలుగులోనూ సుడిగాలి సుధీర్ 'గోట్' మూవీలో ఈ అమ్మడు నటిస్తోంది. మరి ఆ సినిమా విడుదల సమయంలో అయినా... తన లవ్ మేటర్ పై దివ్య భారతి క్లారిటీ ఇస్తుందేమో చూద్దాం.
ALSO READ: Karnataka DCM: నటీనటుల తీరు మారకపోతే.. ఎలా సరిచేయాలో తెలుసు..
Film Industry: శ్రీదేవి, కేదార్ మరణాలు దుబాయ్ లో ఫిబ్రవరిలోనే...
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి