వెంకీమామ చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు

ABN, Publish Date - Jan 11 , 2025 | 06:45 PM

వెంకీమామ చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు 1/6

నా కెరీర్‌లో‌ ఇది మరో సంక్రాంతి. ఒక క్లీన్ ఎంటర్ టైనింగ్ ఫిల్మ్‌తో రావడం చాలా ఆనందంగా వుంది. ఇందులో లిటిల్ క్రైమ్ ఎలిమెంట్ న్యూ జానర్ కూడా వుంది. నా కెరీర్‌లో సంక్రాంతికి వచ్చిన మోస్ట్ ఫిలిమ్స్ చాలా బాగా ఆడాయి.

వెంకీమామ చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు 2/6

ప్రమోషన్స్ చాలా నేచురల్‌గా జరిగాయి. మ్యూజిక్ చాలా నచ్చింది. నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం. కొన్ని మ్యూజిక్ ట్యూన్స్ వినగానే క్రేజీగా అనిపించింది. అలాగే డైరెక్టర్ అనిల్, ఇద్దరు హీరోయిన్స్.. లైవ్లీ టీం కుదిరింది ప్రమోషన్స్‌ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేయడం హ్యాపీగా వుంది.

వెంకీమామ చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు 3/6

నైట్ రెండు గంటలకి ఆ సాంగ్ విన్నప్పుడు తెలియకుండానే డ్యాన్స్ చేశాను. ఏదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్‌లో వుంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఇంగ్లీష్ వర్డ్స్ వుండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది.

వెంకీమామ చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు 4/6

ఇందులో రమణ గోగుల గారు పాడిన ‘గోదారి గట్టు’ పాట పెద్ద హిట్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాడారు. పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. ఈ లైనే చాలా ఫ్రెష్‌గా అనిపించింది

వెంకీమామ చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు 5/6

అనిల్‌ది, నాది సూపర్ హిట్ కాంబినేషన్. పెర్ఫార్మెన్స్ వైజ్ ఇందులో కామెడీ స్టయిల్ కొంచెం డిఫరెంట్‌గా వుంటుంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. చక్కగా పెర్ఫామ్ చేశారు. క్యారెక్టర్స్ వెరీ క్రేజీగా వుంటాయి.

వెంకీమామ చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు 6/6

ఇందులో క్లైమాక్స్‌లో చెప్పే డైలాగ్స్ చాలా క్రేజీగా వుంటాయి. యూత్ డైలాగ్స్‌ని చాలా లవ్ చేస్తారు. సినిమాని ఫాస్ట్‌గా ఫినిష్ చేయడం హ్యాపీగా అనిపించింది. అనుకున్నదాని ప్రకారం అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఆడియన్స్ చాలా ఎంటర్‌టైన్ అవుతారు.

Updated at - Jan 12 , 2025 | 07:14 AM