సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘తల్లి మనసు’ చిత్రానికి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి

ABN,Publish Date - Jan 26 , 2025 | 11:36 PM

1/3

‘తల్లి మనసు’ చిత్రానికి ప్రభుత్వం వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణ మూర్తి అభిలషించారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది.

2/3

పూర్వాశ్రమంలో దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన వి. శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా తెలుగు సినీ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ చిత్రం యూనిట్‌కు అభినందన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుల అసోసియేషన్ కు ఈ చిత్రం ప్రదర్శనను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు.

3/3

చిత్రాన్ని తిలకించిన అనంతరం ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ధూమపానం, మధ్యపానం హానికరమని తెలియజేసేందుకు ప్రకటనల కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటాయి. అవయవదానం విశిష్టతను సైతం ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటాయి. అయితే అవయవదానం ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు తల్లి త్యాగనిరతిని, గొప్పతనాన్ని ఆవిష్కరించిన ఇలాంటి మంచి చిత్రాలను ప్రేక్షకులతో పాటు ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని అన్నారు.

Updated Date - Jan 26 , 2025 | 11:36 PM