అమ్మో అనిపించిన అమ్మ రాజశేఖర్ 'తల'

ABN, Publish Date - Jan 28 , 2025 | 08:22 PM

అమ్మో అనిపించిన అమ్మ రాజశేఖర్ 'తల' 1/8

"తల" చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గాండ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. సోహైల్, హీరో అశ్విన్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

అమ్మో అనిపించిన అమ్మ రాజశేఖర్ 'తల' 2/8

ఈ కార్యక్రమంలో ఎడిటర్ శివ సామి మాట్లాడుతూ.. టైలర్లో ఎంత గూస్ బంప్స్ ఉన్నాయో సినిమాలో అంతకు మించి ఉంటాయి. ప్రతి సీన్ లోఎలివేషన్స్ ఉంటాయి. ట్రైలర్తో చాల తక్కువ చూపించాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి 14న మీముందుకు వస్తున్నాం ఆశీర్వదించండి" అన్నారు.

అమ్మో అనిపించిన అమ్మ రాజశేఖర్ 'తల' 3/8

డి వెంకట్ మాట్లాడుతూ.. 'అమ్మ రాజశేఖర్ సినిమాలు ఇది వరకే చూసి ఉన్నారు. చాలా గ్యాప్ తీసుకుని మీ ముందుకు వస్తున్నారు. చాలా కసితో తల తాకట్టు పెట్టైనా హిట్ కొట్టాలనుకున్నారు. ఈ సినిమాను నిర్మించిన శ్రీనివాస్ గానికి, సిబ్బందికి ప్రత్యేక కృతఙ్ఞతలు. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నా" అన్నారు.

అమ్మో అనిపించిన అమ్మ రాజశేఖర్ 'తల' 4/8

మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాం. ఈ సినిమా ట్రైలక్కు మించి ఉంటుంది. ఈ సినిమాని ఫిబ్రవరి 14న మీ ముందుకు తీసుకొస్తున్నందుకు దీపా ఆర్ట్స్ వారికి ధన్యవాదాలు. రాగిన్ రాజ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. సినిమా అంతా చాలా నాచురల్ గా ఉంటాడు" అన్నారు.

అమ్మో అనిపించిన అమ్మ రాజశేఖర్ 'తల' 5/8

సందీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. సెట్లో చాలా సౌకర్యకరమైన వర్క్ చేశాం. ఈ సినిమాతో చేయడంలో చాలా ఆనందంగా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను. అమ్మ రాజశేఖర్ గారికి కృతఙ్ఞతలు, ప్రతి ఒక్కడూ ఈ సినిమాను ఇష్టపడతారు. రాగిన్ చాలా బాగా నటించారు" అన్నాడు.

అమ్మో అనిపించిన అమ్మ రాజశేఖర్ 'తల' 6/8

ఎస్థర్ మాట్లాడుతూ.. ఈ క్యారెక్టర్ మీరే చేయాలని చెప్పి నాతో నటింపజేశారు. ఈ సినిమా రాగిన కు మంచి డబ్ల్యూ. ఫస్ట్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అంకితను కూడా చాలా బాగా చూపించారు. సినిమా బాగా రావాలి అనుకున్నప్పుడు ఒక్కరు పని చేస్తే చాలడు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించిన సినిమా. ఈ సినిమా మా మమ్మీని హైదరాబాద్ కు తీసుకొచ్చి ఆమెతో కలిసి చూడాలని ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా చూడండి. మీ బైస్సెంగ్స్ వల్ల ఈ సినిమా కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ అవ్వాలి. అంతేకాక కెరియర్ గ్రాఫ్ డబుల్, త్రిబుల్ అవుతుందని నా కోరిక. ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్" అని తెలిపాడు.

అమ్మో అనిపించిన అమ్మ రాజశేఖర్ 'తల' 7/8

హీరోయిన్ అంకిత మాట్లాడుతూ.. నాకు తెలుగు రాదు. నేను బెంగాలీ. ఇదినా ఫస్ట్ సినిమా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అమ్మ రాజశేఖర్ సర్ కి థాంక్యూ. ఫిబ్రవలి 14న మా సినిమా వస్తోంది వాలైంటైన్స్ డే రోజున. ప్రతి ఒక్కరూ సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి" అన్నారు.

అమ్మో అనిపించిన అమ్మ రాజశేఖర్ 'తల' 8/8

నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలును. అమ్మ రాజశేఖర్ ఫస్ట్ సినిమా రణం చేస్తున్నప్పుడు నుంచి వేషం ఉందని చెప్పారు. ఆ సినిమాలో వేషం ఇవ్వలేదు. అదే అడిగితే నెక్స్ట్ సినిమా అన్నారు. రెండు సినిమాల తర్వాత అవకాశం ఇచ్చారు. ఒకసారి అనుకోకుండా మేం కలిశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెన్నై మొత్తం తిప్పి చూపించారు. రాగిన్ పుట్టినరోజుకి వెళ్లాను. ఆ తరువాత నాకు ఫోన్ చేసి మా అబ్బాయి హీరో అంటే నేను ముసలి అవుతున్నట్టు అనిపించింది. హీరోకి ఉండాల్సిన లక్షణాన్నీ ఉన్నాయి. తల వైలెంట్ వాలెంటైన్స్ డే నాడు విడుదలవుతుంది. అందరూ చూడండి' అన్నాడు.

Updated at - Jan 29 , 2025 | 08:05 AM