Suryapet Junction: ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే.. ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’

ABN, Publish Date - Feb 01 , 2025 | 09:21 PM

Suryapet Junction: ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే.. ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ 1/5

‘కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించిన చిత్రం ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ అభిమన్యు సింగ్ ఓ కీలక పాత్రలో నటించిన చిత్ర థియేట్రికల్ ట్రైల‌ర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Suryapet Junction: ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే.. ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ 2/5

‘‘ఈ సినిమాకు కథ నేనే రాశాను. సూర్యాపేట ప‌రిస‌రాల్లో జరిగే కథ ఇది. గవర్నమెంట్ నుంచి ఉచితాలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారో తెలిపే స‌బ్జెక్టు ఇది. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు అదరిస్తారు, హిట్టు చేస్తారని ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమా చేశాం. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా సహజంగానే ఉంటాయి. డైరెక్టర్ రాజేశ్‌ అద్భుతంగా ఈ సినిమాను తీశారు’’ అని అన్నారు హీరో ఈశ్వర్.

Suryapet Junction: ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే.. ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ 3/5

హీరోయిన్ నైనా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను జ్యోతి పాత్ర‌లో న‌టించాను. యూత్‌కు బాగా న‌చ్చే స‌బ్జెక్టు ఇది. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌తి ఒక్క‌రు ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ మూవీని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నానని అన్నారు.

Suryapet Junction: ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే.. ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ 4/5

నిర్మాత అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ... మా హీరో ఈశ్వర్ నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. మా హీరో కథకి పూర్తి న్యాయం చేశాడు. కన్నడ, మలయాళం చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన నైనా సర్వర్‌కి ఇది తెలుగులో మొదటి సినిమా. అయినప్పటికీ చాలా చక్కగా నటించింది. ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ రోల్ ఈ సినిమాకు ప్రత్యేకమని తెలిపారు.

Suryapet Junction: ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే.. ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ 5/5

దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ.. ఈ సినిమాకు రోషన్ సాలూరి, గౌర హరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఉన్న మూడు పాటలు, ఒక ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయి. నిర్మాతలు ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. త్వరలో రిలీజ్ చేస్తామని అన్నారు.

Updated at - Feb 01 , 2025 | 09:21 PM