రెండో పెళ్లిపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN, Publish Date - Feb 06 , 2025 | 01:11 PM

రెండో పెళ్లిపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 1/5

తన జీవితంలో అసూయకు స్థానం లేదన్నారు కథానాయిక సమంత. తన మాజీ భర్త నాగచైతన్య రెండో వివాహంపై సమంత తొలిసారి స్పందించారు.

రెండో పెళ్లిపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 2/5

ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘జీవితంలో అన్ని అనర్ధాలకు మూలం అసూయే. దానికి నా జీవితంలో స్థానం లేదు. గతంలో నాతో రిలేషన్షిప్ లో ఉన్నవారిపైన నాకేం కోపం, అసూయ లేవు.

రెండో పెళ్లిపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 3/5

అలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించను’ అని పరోక్షంగా నాగచైతన్య గురించి స్పందించారు. ఒకరిపైన అసూయను పెంచుకోవడం వల్ల బాధపడడం తప్ప ఒరిగేదేముంది అన్నారు.

రెండో పెళ్లిపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 4/5

రిలేషన్షిప్ వల్ల గతంలో చాలా కష్టాలు పడ్డానని చెప్పారు. వాటి నుంచి బయటపడడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందనీ, ఆ అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం రిలేషన్షిప్ గురించి ఆలోచించడం లేదని తెలిపారు.

రెండో పెళ్లిపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 5/5

సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్య హీరోయిన్‌ శోభితా ధూళిపాళ్లను పెళ్లాడిన విషయం తెలిసిందే.

Updated at - Feb 06 , 2025 | 01:13 PM