సీమచరిత్ర నేపథ్యంగా 'రాచరికం'

ABN, Publish Date - Jan 29 , 2025 | 10:00 PM

సీమచరిత్ర నేపథ్యంగా 'రాచరికం' 1/6

రాయలసీమ చిత్రా నేపథ్యంగా సీమ వాసులంతా మెచ్చేలా రాచరికం నిర్మించినట్లు విజయ్ శంకర్, నిర్మాత ఈశ్వర్ చాణుక్యలు పేర్కొన్నారు.

సీమచరిత్ర నేపథ్యంగా 'రాచరికం' 2/6

సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా బుధవారం అనంతపురం వచ్చిన హీరోలు విజయ్ శంకర్, వరుణ్ సందేశ్, హీరోయిన్ అప్సర రాణిలతో పాటు చిత్కర బృందం నగరంలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

సీమచరిత్ర నేపథ్యంగా 'రాచరికం' 3/6

ఈ సందర్భంగా నిర్మాత ఈశ్వర్ చాణుక్య మాట్లాడుతూ అనంతపురం నివాసి అయిన తాను ఇక్కడివారిని ప్రోత్సహించాలనే నేపథ్యంతో సినిమాలో టెక్నీషియన్లుగా దాదాపు 70 శాతం మందిని అనంతపురం జిల్లా వాసులను తీసుకున్నట్లు తెలిపారు.

సీమచరిత్ర నేపథ్యంగా 'రాచరికం' 4/6

జిల్లా నుంచి మరింత మంది కళాకారులను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 31న విడుదల కానున్న రాచరికం సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిజం, రాజకీయాలను చూపించినట్లు తెలిపారు.

సీమచరిత్ర నేపథ్యంగా 'రాచరికం' 5/6

అనంతరం హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ చాలా సినిమాల్లో అనంతపురం అంటే ఫ్యాక్షనిజం మాత్రమే చూపారని, కానీ ఇక్కడ ప్రేమకూ కొరత లేదని తమ చిత్రం నిరూపిస్తుంది అన్నారు. వరుణ్ సందేశ్ లో మరో కోణాన్ని ఈ సినిమాలో చూడవచ్చునన్నారు.

సీమచరిత్ర నేపథ్యంగా 'రాచరికం' 6/6

హీరోయిన్ అప్సరా రాణి మాట్లాడుతూ అనంతపురంలో పర్యటించాలని ముందు నుంచి తనుకు ఆశగా ఉండేదని, ఆ ఆశ ఈ సినిమా ద్వారా నెరవేరిందన్నారు. కార్యక్రమంలో దర్శకుడు సురేష్ లంకలపల్లి, చాణుక్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Updated at - Jan 29 , 2025 | 10:07 PM