సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎన్టీఆర్‌కి సైకిల్‌కి ఉన్నా సంబంధమేంటో మీకు తెలుసా..

ABN,Publish Date - Jan 17 , 2025 | 10:18 PM

1/10

చలనచిత్ర పరిశ్రమలో 300 కి పైగా సినిమాల్లో నటించి, రారాజులా వెలుగొంది, తరువాత రాజకీయాలకు వచ్చి అక్కడ సంచలనం సృష్టించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్

2/10

ఎన్టీఆర్అంటే ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం, ఒక చరిత్ర. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాకే తెలుగు ప్రజల నాడి, వేడి, ఉనికి ప్రపంచం నలుమూలలా పాకింది, తెలిసింది.

3/10

అంతటి ప్రభావం చూపించారు ఎన్టీఆర్ గారు. అందరూ ఆప్యాయంగా అన్నగారు అని పిలుచుకునే అన్న నందమూరి తారక రామారావు నాలుగు దశాబ్దాల పాటు చలన చిత్ర పరిశ్రమలో ఒక మహరాజులా వెలుగొందాడు.

4/10

'నా దేశం' నుండి 'మన దేశం' వరకు తనకు ఎదురులేని, తనకు తానే సాటి అని నిరూపించుకొని అప్రతిహత జైత్రయాత్ర సాగించారు అన్నగారు.

5/10

జానపదం, పురాణాలు, సాంఘికం, చారిత్రాత్మక ఒకటేమిటి అన్ని రకాల సినిమాలు చేసి, తన నటనా విశ్వరూపం చూపించారు.

6/10

ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. ఒకే సినిమాలో 'దాన వీర శూర కర్ణ'లో మూడు పాత్రలు, 'శ్రీ మద్విరాటపర్వం'లో అయిదు పాత్రలు వేసి అన్ని పాత్రల్లోనూ వైవిధ్యం చూపించిన గొప్ప నటుడు అయన.

7/10

పురాణాల్లో వుండే ప్రతినాయకుడి పాత్రలను, రావణాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు, కర్ణుడు ఇలాంటి ఎన్నో పాత్రలను తన నట కౌశలంతో వాటికి వన్నె తెచ్చిన గొప్ప నట చక్రవర్తి ఎన్టీఆర్.

8/10

ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు విజయవాడలో పాలు పోసేవారు అని చెపుతూ ఉండేవారు.

9/10

సైకిల్ మీద వెళ్లి కొన్ని హోటల్స్ లో, ఇళ్లలో పాలు పోసేవారు అని, పాల వ్యాపారం చేసేవారు అని అంటూ ఉండేవారు.

10/10

ఆలా సైకిల్ మీద వెళ్లి పాలు పోస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది. ఇది 1943 లో తీసినది.

Updated Date - Jan 18 , 2025 | 06:02 AM