హైదరాబాద్ ఫిలింనగర్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి

ABN, Publish Date - Jan 19 , 2025 | 01:41 PM

హైదరాబాద్ ఫిలింనగర్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి 1/7

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయనను స్మరించుకుంటూ హైదరాబాదులోని ఫిలింనగర్‌లో కృష్ణావతారంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఎన్టీఆర్‌కు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు, అభిమానులు ఫిలింనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయనను స్మరించుకున్నారు.

హైదరాబాద్ ఫిలింనగర్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి 2/7

‘నేను ఎన్టీఆర్ గారికి అభిమానిని మాత్రమే కాదు, పరమ భక్తుడిని కూడా. ఆయన మనిషి రూపంలో ఉన్న దైవం. ఆయనను నమ్ముకున్న వారిని ఎవరిని ఎన్టీఆర్ గారు వదులుకోలేదు. మరోసారి అన్నగారు తెలుగు గడ్డమీద పుట్టాలి, మరోసారి తెలుగు వారి స్థాయిని పెంచాలి అని కోరుకుంటున్నాను’ అని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.

హైదరాబాద్ ఫిలింనగర్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి 3/7

దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఈరోజు తెలుగువారి గురించి మాట్లాడుతున్నారు అంటే దానికి ముఖ్య కారణం నందమూరి తారక రామారావు. అటువంటి మహానుభావుడికి భారతరత్న కచ్చితంగా ఇవ్వాలి. ఆ దిశగా మనం పోరాటం చేయాలని అన్నారు మాదాల రవి.

హైదరాబాద్ ఫిలింనగర్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి 4/7

ఎన్టీఆర్ మనవరాలు నందమూరి రూప మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావుగారు. ఆయన 29వ వర్ధంతి సందర్భంగా మనమందరం ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఎప్పటికీ మన ఆలోచనలో ఉంటారు. ఆయన మరణం లేని వ్యక్తి. మా తాత గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లోనే నడవాలని కోరుకుంటున్నానని అన్నారు.

హైదరాబాద్ ఫిలింనగర్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి 5/7

ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ఈరోజు నాన్నగారి 29వ వర్ధంతి జరుపుకుంటున్నాం. సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు నిలిచిపోతుంది. ఆయన సినీ రంగంలో, రాజకీయ రంగంలో పెను తుఫాను సృష్టిస్తూ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆడవారికి ఆస్తి హక్కుల దగ్గర నుండి రెండు రూపాయలకు కిలో బియ్యం కొరకు ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ గారు చేసిన సేవలను గుర్తించి ఆయనను భారతరత్నతో సత్కరించాలని విన్నపించుకుంటున్నానని అన్నారు.

హైదరాబాద్ ఫిలింనగర్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి 6/7

బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరూ గమనించదగిన వ్యక్తి. ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారు అప్పటినుండి ఆయనతో మా ప్రయాణం మొదలైంది. ఆయన నాపై ఎంతో నమ్మకం పెట్టుకుని బాధ్యతగల పదవులు అప్పగించడం జరిగింది. కాషాయి వస్త్రాలతో రాజకీయాల్లో ఉండి ఆ రోజుల్లో దేశం మొత్తం తిరిగిన వ్యక్తి ఆయన. పార్టీ పెట్టి 9 నెలలోనే అధికారంలోకి రావడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారికి భారతరత్న వచ్చేందుకు మనమంతా కృషి చేయాలని అన్నారు.

హైదరాబాద్ ఫిలింనగర్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి 7/7

తెలుగు చిత్ర నిర్మాత మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న మాట్లాడుతూ.. తెలుగువారంటనే చిన్న చూపు చూసే రోజుల్లో కేవలం 9 నెలలలో రాజకీయ పార్టీ పెట్టి అధికారాన్ని కైవసం చేసుకుని తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావుగారు. అటువంటి మహానుభావుడు ఒక సంఘసంస్కర్తగా ఆయన శివైక్యం చెంది 29 సంవత్సరాలు పూర్తయినా కూడా తలుచుకుంటున్నాము. ఆయన మరణం లేని వ్యక్తి అని ప్రసంగించారు.

Updated at - Jan 19 , 2025 | 01:41 PM