సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Madha Gaja Raja Combo: ‘మదగజరాజా’ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా..

ABN,Publish Date - Jan 24 , 2025 | 10:11 PM

1/5

గతంలో ‘ఆంబల’, ‘యాక్షన్‌’, ‘మదగజరాజా’ వంటి సినిమాలతో హిట్‌ కాంబినేషన్‌గా గుర్తింపు పొందిన దర్శకుడు సుందర్‌, హీరో విశాల్‌ మరోమారు వెండితెరపై సందడి చేయనున్నారు.

2/5

వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. సుందర్‌ సి దర్శకత్వంలో విశాల్‌ నటించిన ‘మదగజరాజా’ పొంగల్‌కు విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో దర్శక హీరోలు ఎంతో ఖుషీగా ఉన్నారు.

3/5

ఈ నేపథ్యంలో మరోమారు కలిసి పనిచేయాలని వీరు నిర్ణయించారు. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అన్నీ సాఫీగా సాగితే మార్చిలో ఈ కొత్త చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళాలని భావిస్తున్నారు.

4/5

ప్రస్తుతం విశాల్‌ స్వీయ దర్శకత్వంలో ‘తుప్పరివాలన్‌-2’ తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్‌ లండన్‌లో జరపాల్సి ఉంది. గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వాల్లో విశాల్‌ నటించాల్సి ఉంది.

5/5

అదేవిధంగా సుందర్‌ కూడా ‘గ్యాంగర్స్‌’ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. సుధీర్ఘ విరామం తర్వాత సుందర్‌ సి తో కలిసి ప్రముఖ హాస్య నటుడు వడివేలు పనిచేస్తున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్‌లోనూ వీరిద్దరు కలిసి మరో హాస్యభరిత చిత్రాన్ని రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తమిళ సినీ వర్గాల సమాచారం.

Updated Date - Jan 24 , 2025 | 10:31 PM