గుజరాత్ సీఎం ఇంట్లో ‘కన్నప్ప’ టీమ్.. మోహన్ బాబు ఏమన్నారంటే

ABN, Publish Date - Jan 29 , 2025 | 01:32 PM

గుజరాత్ సీఎం ఇంట్లో ‘కన్నప్ప’ టీమ్.. మోహన్ బాబు ఏమన్నారంటే 1/4

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ఏప్రిల్ 25న విడుదలకు రెడీ అవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని ‘కన్నప్ప’ టీమ్ స్టార్ట్ చేసింది.

గుజరాత్ సీఎం ఇంట్లో ‘కన్నప్ప’ టీమ్.. మోహన్ బాబు ఏమన్నారంటే 2/4

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించిన టీమ్.. తాజాగా గుజరాత్‌‌లో ప్రత్యక్షమైంది. ‘కన్నప్ప’ టీమ్ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ని కలిసినట్లుగా మంచు మోహన్ బాబు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేశారు.

గుజరాత్ సీఎం ఇంట్లో ‘కన్నప్ప’ టీమ్.. మోహన్ బాబు ఏమన్నారంటే 3/4

కన్నప్ప టీమ్ అయిన మంచు విష్ణు, శరత్ కుమార్, ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరిలతో కలిసి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను.

గుజరాత్ సీఎం ఇంట్లో ‘కన్నప్ప’ టీమ్.. మోహన్ బాబు ఏమన్నారంటే 4/4

ఆయన శ్రేయస్సును కోరుతూ మంచు విష్ణు ఆయనకు ప్రఖ్యాత తెలుగు కళాకారుడు రమేష్ గుర్జాల గీసిన పెయింటింగ్‌ని బహుమతిగా ఇచ్చాడు. గుజరాత్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే డైనమిక్ లీడర్‌గా ఆయన సక్సెస్ కొనసాగాలని కోరుకుంటున్నట్లుగా మోహన్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated at - Jan 29 , 2025 | 01:32 PM