విజయ్ దేవరకొండతో యాక్ట్ చేసి తప్పు చేశా.

ABN, Publish Date - Feb 07 , 2025 | 12:04 PM

విజయ్ దేవరకొండతో యాక్ట్ చేసి తప్పు చేశా. 1/6

భారతీయ సినిమా చరిత్రలో మోస్ట్ ట్రోలింగ్ కు గురైన సినిమా 'లైగర్'. బాలీవుడ్ యాక్ట్రెస్ అనన్య పాండే తెలుగులో డెబ్యూ చేసింది ఇది ఆమె ఫస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్

విజయ్ దేవరకొండతో యాక్ట్ చేసి తప్పు చేశా. 2/6

ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్, అనన్యల మధ్య కెమిస్ట్రీ చూసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యింది. కానీ.. ఈ సినిమా గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

విజయ్ దేవరకొండతో యాక్ట్ చేసి తప్పు చేశా. 3/6

అనన్య పాండే నెపో బేబీ అని ఇండస్ట్రీలోకి రాగానే చాలా విమర్శలను ఎదురుకుంది. కెరీర్ ఆరంభంలో ఆమె స్టోరీ సెలెక్షన్ బెడిసికొట్టడంతో సినీ అభిమానులు రెచ్చిపోయి మరి ట్రోలింగ్ చేశారు.

విజయ్ దేవరకొండతో యాక్ట్ చేసి తప్పు చేశా. 4/6

అనన్య పాండే తండ్రి, బాలీవుడ్ నటుడు చంకీ పాండే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''అనన్యకు ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు అసౌకర్యంగా ఫీలైంది. ఆ పాత్రకు తాను సెట్‌ కానని, చిన్న పిల్లలా కనిపిస్తానని భావించింది కన్ఫ్యూజన్ లో ఉండిపోయింది.

విజయ్ దేవరకొండతో యాక్ట్ చేసి తప్పు చేశా. 5/6

నా దగ్గరకు వచ్చి 'పాపా.. ఈ పాత్ర చేయడానికి నేను చాలా చిన్నదాన్ని' అని అంది. కానీ ఈ సినిమా చేయమని నేను చెప్పాను. ఇది పెద్ద కమర్షియల్ సినిమా అని, సక్సెస్‌ అయితే మంచి పేరొస్తుందని ఒప్పించాను'' అని అన్నారు.

విజయ్ దేవరకొండతో యాక్ట్ చేసి తప్పు చేశా. 6/6

అంతకు ముందు ఓ షోలో అనన్య కూడా మాట్లాడుతూ.. పేరెంట్స్ చెప్పడంతోనే ఈ సినిమా చేశాను అంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఫ్లాప్ కావడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.

Updated at - Feb 07 , 2025 | 12:04 PM