Akhil Akkineni: నాలుగు సార్లు టైటిల్ గెలిచాం.. ఐదవసారి కొడతామనే నమ్మకముంది

ABN, Publish Date - Feb 02 , 2025 | 10:19 PM

Akhil Akkineni: నాలుగు సార్లు టైటిల్ గెలిచాం.. ఐదవసారి కొడతామనే నమ్మకముంది 1/6

CCL 11వ సీజన్ తెలుగు వారియర్స్ థ్రిల్లింగ్ గేమ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 8న బెంగళూరులో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 11వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ CCLలో నాలుగుసార్లు ఛాంపియన్‌లుగా నిలిచిన తెలుగు వారియర్స్.. 5వ సారి టైటిల్ కొట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలుగు వారియర్స్ న్యూ జెర్సీ లాంచ్ వేడుకలో కెప్టెన్ అఖిల్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఈసారి టైటిల్ కొట్టబోతున్నట్లుగా చెప్పారు.

Akhil Akkineni: నాలుగు సార్లు టైటిల్ గెలిచాం.. ఐదవసారి కొడతామనే నమ్మకముంది 2/6

తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. సిసిఎల్ 14 ఏళ్ల జర్నీ. సిసిఎల్ ఆడుతూ పెరిగాను. విష్ణు, సచిన్ ప్యాషన్‌తో ఇది సాధ్యమైంది. మేము నాలుగు సార్లు టైటిల్ గెలిచాం. ఈసారి కూడా టైటిల్ కొట్టి ఐదవసారి ఛాంపియన్‌గా నిలుస్తామనే నమ్మకం వుంది. అన్నిటికంటే అందరినీ ఎంటర్ టైన్ చేయాలనే ప్యాషన్‌తో వస్తున్నాం. 14, 15 ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం. అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.

Akhil Akkineni: నాలుగు సార్లు టైటిల్ గెలిచాం.. ఐదవసారి కొడతామనే నమ్మకముంది 3/6

ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. క్రికెట్ అనేది నా చైల్డ్ వుడ్ డ్రీమ్. సిసిఎల్ ఫార్మెట్ నా డ్రీమ్‌ని తీర్చింది. దేశంలోని ప్రముఖ మైదానాల్లో క్రికెట్ ఆడటం ఓ అదృష్టం. అఖిల్ అగ్రెసివ్ కెప్టెన్. తన ఎత్తుగడలు అద్భుతంగా వుంటాయి. తనలో చాలా ఫైర్ వుంది. క్రికెట్ మాకు చాలా ఎనర్జీ ఇస్తోంది. మాది చాలా క్రేజీ టీమ్. సచిన్ టీంకి ఓనర్‌తో పాటు ఆటగాడిగా బిగ్గెస్ట్ స్ట్రెంత్. మూడు నెలలుగా చాలా ప్రాక్టీస్ చేశాం. ఈసారి తప్పకుండా కప్ కొడతామని అన్నారు.

Akhil Akkineni: నాలుగు సార్లు టైటిల్ గెలిచాం.. ఐదవసారి కొడతామనే నమ్మకముంది 4/6

సచిన్ జోషి మాట్లాడుతూ.. ఇండియాలో అందరి డ్రీమ్ క్రికెట్. ఆ డ్రీమ్ మాకు సిసిఎల్ రూపంలో తీరింది. ఈ క్రెడిట్ విష్ణుకి ఇస్తాను. తన ఆలోచన గొప్ప విజయం సాధించింది. వెంకటేష్ గారికి థాంక్యూ. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. మా టీం అంతా నా ఫ్యామిలీ. అన్ని సమయంలో చాలా సపోర్ట్ చేశారు. అఖిల్ పాషనేట్ క్రికెటర్. మా స్పాన్సర్స్ అందరికీ థ్యాంక్యూ అని తెలిపారు.

Akhil Akkineni: నాలుగు సార్లు టైటిల్ గెలిచాం.. ఐదవసారి కొడతామనే నమ్మకముంది 5/6

CCL వ్యవస్థాపకుడు విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ.. CCL 11వ సీజన్‌కు చేరుకోవడం మాకు గర్వకారణం. దీనిలో పాల్గొనే జట్ల నైపుణ్యం, స్ఫూర్తి, దృఢ సంకల్పాన్ని చూసి మేము సంతోషిస్తున్నాము. తెలుగు వారియర్స్ ఎల్లప్పుడూ టోర్నమెంట్‌కు అదనపు ఉత్సాహాన్ని తెస్తుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అశ్విన్, రఘు, ఆది, సామ్రాట్, షోరబ్ అర్ఫాత్ వంటి వారు మాట్లాడారు.

Akhil Akkineni: నాలుగు సార్లు టైటిల్ గెలిచాం.. ఐదవసారి కొడతామనే నమ్మకముంది 6/6

సీజన్ 11 గేమ్ షెడ్యూల్ ఫిబ్రవరి 8, బెంగళూరు: తెలుగు వారియర్స్ vs కర్ణాటక బుల్డోజర్స్ ఫిబ్రవరి 14, హైదరాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్): తెలుగు వారియర్స్ vs భోజ్‌పురి దబ్బాంగ్స్ ఫిబ్రవరి 15, హైదరాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్): తెలుగు వారియర్స్ vs చెన్నై రైనోస్ ఫిబ్రవరి 23, సూరత్: తెలుగు వారియర్స్ vs బెంగాల్ టైగర్స్ సోనీ స్పోర్ట్స్ టెన్ 3 ఛానల్, హాట్‌స్టార్ OTTలో ప్రత్యక్ష ప్రసారం

Updated at - Feb 02 , 2025 | 10:19 PM