మీడియాపై మండిపడ్డ బుట్టబొమ్మ

ABN, Publish Date - Feb 04 , 2025 | 04:48 PM

మీడియాపై మండిపడ్డ బుట్టబొమ్మ 1/6

షాహిద్‌ కపూర్‌, పూజా హెగ్డే జంటగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘దేవా’. ఈ సినిమా ఇటీవలే విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది.

మీడియాపై మండిపడ్డ బుట్టబొమ్మ 2/6

ఈ సందర్భంగా చిత్రబృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో పూజాకు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురయ్యాయి.

మీడియాపై మండిపడ్డ బుట్టబొమ్మ 3/6

మీరు స్టార్‌ హీరోల సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నారు, ఇతర సౌత్‌ హీరోయిన్లకు అవకాశం దక్కడం లేదు అని పూజాను మీడియా ప్రశ్నించింది.

మీడియాపై మండిపడ్డ బుట్టబొమ్మ 4/6

స్టార్‌ హీరోలతో నటించే అర్హత నాకుంది. వాళ్ల సినిమాల్లో ఎంపిక చేసుకుంటున్నారంటే, అందుకు నేను అర్హురాలిననే కదా. కష్టపడితేనే అదృష్టం వస్తుందంటారు. నా విషయంలోనూ అదే జరిగిందని అనుకుంటాను.. అని పూజా బదులిచ్చింది.

మీడియాపై మండిపడ్డ బుట్టబొమ్మ 5/6

మీరు బాలీవుడ్‌లో అడుగుపెట్టి చాలా కాలమైంది. ఎందరో స్టార్‌ హీరోలతో నటించారు. కానీ అందులో ఒక్క మూవీ కూడా హిట్‌ కాలేదు. అయినా మీకు అవకాశాలు ఎలా వస్తున్నాయి.. అని మీడియా అడిగిన ప్రశ్నకు..

మీడియాపై మండిపడ్డ బుట్టబొమ్మ 6/6

చెప్పాను కదా కష్టపడితే అదృష్టం వస్తుందని. అయినా ‘నాతో మీకేంటీ ప్రాబ్లమ్‌’ అంటూ మీడియాపై పూజా హెగ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated at - Feb 04 , 2025 | 04:49 PM