పెళ్లి గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటున బ్యూటీ

ABN, Publish Date - Feb 09 , 2025 | 02:43 PM

పెళ్లి గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటున బ్యూటీ 1/6

నిధి అగర్వాల్ ప్రేక్షకులకు ఈ పేరుని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా.. తన గ్లామర్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

పెళ్లి గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటున బ్యూటీ 2/6

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామపై పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలను నిధి అగర్వాల్ ఖండించారు.

పెళ్లి గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటున బ్యూటీ 3/6

పెళ్ళి గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు అంటూ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ విఙ్ఞప్తి చేశారు.

పెళ్లి గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటున బ్యూటీ 4/6

టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె రవి మోహన్‌ నటించిన ‘భూమి’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఒక్క తమిళ సినిమాకు సంతకం చేసి మూడేళ్ళు అయింది.

పెళ్లి గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటున బ్యూటీ 5/6

హరిహర వీరమల్లు’ మూవీలో నటించేందుకు ఒప్పందంపై సంతకాలు చేసే ముందు.. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యేంత వరకు మరో సినిమాలో నటించకూడదన్న షరతుకు అంగీకరించారు నిధి అగర్వాల్. ఫలితంగా ఈ భామ మూడేళ్ళుగా మరో కొత్త చిత్రంలో నటించలేని పరిస్థితి నెలకొంది.

పెళ్లి గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటున బ్యూటీ 6/6

ప్రస్తుతం తన ధ్యాసంతా నటిగా సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడంపైనే ఉందని తెలిపారు. కావాలని కొందరు పెళ్లి అంటూ వార్తలు పుట్టిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. త్వరలోనే తన నూతన ప్రాజెక్ట్‌ల ప్రకటన వస్తుందని పేర్కొన్నారు.

Updated at - Feb 09 , 2025 | 02:44 PM