Akhanda -2: హక్కుల కోసం ఓటీటీల ఆరాటం

ABN, Publish Date - Apr 19 , 2025 | 03:50 PM

నటసింహ నందమూరి బాలకృష్ణ 'అఖండ -2' కోసం రెండు బిగ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పోటీ పడుతున్నాయి... దాంతో 'అఖండ-2' పై మార్కెట్ బజ్ కూడా మరింతగా పెరిగింది... ఇంతకూ బాలయ్య సినిమా కోసం పోటీపడుతున్న ఓటీటీ వేదికలేవో తెలుసుకుందాం.

'అఖండ' (Akhanda) గ్రాండ్ సక్సెస్ వల్ల బాలకృష్ణ (Balakrishna) తో దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) 'హ్యాట్రిక్' కొట్టేశారు. ఈ మధ్యకాలంలో ఓ హీరోతో ఓ డైరెక్టర్ వరుసగా మూడు గ్రాండ్ విక్టరీస్ చూసిన దాఖలాలు లేవు... ఆ రికార్డును సొంతం చేసుకోవడంతో బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతోన్న 'అఖండ-2' (Akhanda -2) కు మరింత క్రేజ్ పెరిగింది... దాంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ (Netflix), అమేజాన్ (Amazon) వంటి బిగ్ కంపెనీస్ పోటీపడడం విశేషంగా మారింది... అందుకు కారణం లేకపోలేదు సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ సినిమా 'డాకు మహారాజ్' (Daaku Maharaj) థియేటర్లలో పరవాలేదనిపించుకుంది... అయితే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలెట్టిన 'డాకు మహారాజ్' రికార్డ్ స్థాయిలో వ్యూస్ సంపాదించింది... ఈ సినిమా ఓటీటీలో మొదటి వారంలోనే 2.5 మిలియన్ వ్యూస్ సాధించింది... తరువాతి వారంలో 2.8 మిలియన్ వ్యూస్ పోగేయడం విశేషంగా మారింది... అంటే రెండోవారంలోనే 'డాకు మహారాజ్'కు ఓటీటీలో మరింత బజ్ రావడం గమనార్హం! అందువల్ల బాలయ్య రాబోయే 'అఖండ-2' ఓటీటీ రైట్స్ సొంతం చేసుకొనేందుకు అమేజాన్, నెట్ ఫ్లిక్స్ మధ్య పోటీ నెలకొందని టాక్!


అదే కారణం...

నిజానికి బాలకృష్ణ సూపర్ హిట్ మూవీస్ కు కూడా ఓటీటీలో వ్యూస్ తక్కువగా ఉండేవి... ఎందుకంటే బాలయ్య ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాలను బుల్లితెరపై కంటే బిగ్ స్క్రీన్ పై చూడటానికే ఇష్టపడతారు... థియేటర్లలోనే తమ హీరో సినిమాను బాలయ్య అభిమానులు ఒకటికి రెండుమూడు సార్లు చూసేస్తారు... అందువల్ల ఓటీటీలో బాలయ్య మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నా, అంతగా పట్టించుకోరు... కానీ, సంక్రాంతి బరిలో దూకి మొదట బంపర్ హిట్ టాక్ సంపాదించినా, తరువాత హిట్ కే పరిమితమయింది 'డాకు మహారాజ్'... అందువల్లే కాబోలు ఓటీటీలో ఈ సినిమాను ఫ్యాన్స్ తెగ చూసేశారు... ఆ కారణంగానే ఏ తెలుగు సినిమాకు రానటువంటి వ్యూవర్ షిప్ ను 'డాకు మహారాజ్' సొంతం చేసుకోవడం విశేషం... దీంతో బాలయ్య రాబోయే సినిమాల ఓటీటీ రైట్స్ కు క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు...


నెలాఖరులో తేలనున్న లెక్క...

బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా 'అఖండ-2' తెరకెక్కుతోంది... శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా సెప్టెంబర్ 25న జనం ముందుకు రానుంది... బాలయ్య కెరీర్ లో అత్యంత భారీగా రూపొందుతున్న ఈ చిత్ర వ్యయం 200 కోట్ల రూపాయలని తెలుస్తోంది... ఈ నేపథ్యంలో ముందుగా నాన్-థియేట్రికల్ డీల్స్ ను ముగించాలని నిర్మాతలు ఆశిస్తున్నారు... ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థతో కలసి బాలయ్య చిన్నకూతురు తేజస్విని నిర్మిస్తున్నారు... ఈ నెలాఖరులోగా ఓటీటీ రైట్స్ ను ఏ సంస్థకు ఇస్తారో తేలనుంది... బాలయ్య సినిమాలను సరిగా ప్రమోట్ చేయలేకపోవడం వల్లే ఆయన ఓటీటీ మార్కెట్ తక్కువగా ఉందని, 'డాకు మహారాజ్' స్ట్రీమింగ్ చూశాక అందరిలోనూ ఉత్సాహం కలుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు... దసరా కానుకగా రానున్న 'అఖండ-2' మరి ఏ ఓటీటీ వేదికపై అలరించనుందో చూడాలి.

Also Read: Sankranthi Movies: వంద రోజులు ఎక్కడంటే...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 19 , 2025 | 03:53 PM