Squid Game 3: 'స్క్విడ్ గేమ్ 3' వచ్చేస్తుంది

ABN, Publish Date - Jan 30 , 2025 | 09:36 PM

Squid Game 3: 'స్క్విడ్ గేమ్' రెండవ సీజన్ రిలీజ్ చేయడానికి మూడేళ్లు తీసుకున్న మేకర్స్ మూడో సీజన్ రిలీజ్ చేసేందుకు పెద్ద సమయం తీసుకోలేదు. తాజాగా సీజన్ 2 రిలీజ్ డేట్ ని నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ గా ప్రకటించింది.

కరోనా పాండమిక్ తర్వాత సినీ ప్రేక్షలుకుల తీరే మారిపోయింది. అందరు గ్లోబల్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు అలవాటు పడ్డారు. కేవలం ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్ లకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా అన్ని భాషల కంటెంట్ ని ఆదరించారు. సరిగ్గా అదే సమయంలో(2021) మార్కెట్ లోకి అనామకంగా ఎంట్రీ ఇచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'. ఘోరమైన రూల్స్‌, టాస్కుల‌తో, ట్విస్టుల‌తో ఓళ్లు గ‌గుర్పొడిచేలా మొదటిసారి ప్రేక్షకులు ఇలాంటి సిరీస్ ని ఎక్స్ పీరియన్స్ చేయడంతో సంచలన విజయం సాధించింది. 2024లో సీజన్ 2 వచ్చి అది సంచలన విజయం నమోదు చేసుకుంది.


అనామకంగా 2021లో రిలీజైన ఈ సిరీస్ విడుదలైన 27 రోజుల్లోనే 111 మిలియన్స్ పైగా వ్యూస్ సంపాదించింది. అలాగే సీజన్ 2 కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే రెండవ సీజన్ రిలీజ్ చేయడానికి మూడేళ్లు తీసుకున్న మేకర్స్ మూడో సీజన్ రిలీజ్ చేసేందుకు పెద్ద సమయం తీసుకోలేదు. తాజాగా సీజన్ 2 రిలీజ్ డేట్ ని నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ గా ప్రకటించింది. జూన్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సీజన్ 3 స్ట్రీమ్ కానుంది.హ్వాంగ్‌ డాగ్‌ హ్యూక్‌ నిర్మించిన ఈ సిరీస్ మొదటి రెండు భాగాలు తెలుగులో అందుబాటులో ఉన్నాయి. రిలీజైన కొన్ని రోజులకే మూడో భాగాన్ని కూడా తెలుగులో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.


Also Read- Thandel: నార్త్ మార్కెట్‌ని కొల్లగొట్టేందుకు చైతన్య ప్లాన్

Also Read- Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం

Also Read- Spirit: రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్ అప్పుడే

Also Read- Kangana Ranaut: కాజోల్‌, దీపికా ముద్దు.. మేమంటే చేదు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 09:41 PM