Aha Ott: ఆహా... భలే ప్లాన్ వేశారుగా...

ABN, Publish Date - Feb 15 , 2025 | 06:12 PM

తెలుగు వారి ఫేవరేట్ ఓటీటీగా చెప్పుకునే ఆహా (AHA) వీక్షకులను నూరు శాతం ఆకట్టుకునే విషయంలో ఇంకా తడబడుతూనే ఉంది. క్రేజీ మూవీస్ ఓటీటీ హక్కులు తీసుకోలేక... అనువాద చిత్రాలకే మొదట్లో ఎక్కువ మొగ్గు చూపింది. ఆ తర్వాత చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది.

తెలుగు వారి ఫేవరేట్ ఓటీటీగా చెప్పుకునే ఆహా (AHA) వీక్షకులను నూరు శాతం ఆకట్టుకునే విషయంలో ఇంకా తడబడుతూనే ఉంది. క్రేజీ మూవీస్ ఓటీటీ హక్కులు తీసుకోలేక... అనువాద చిత్రాలకే మొదట్లో ఎక్కువ మొగ్గు చూపింది. ఆ తర్వాత చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది. తెలుగులో పూర్తి స్థాయిలో నిలదొక్కుకోక ముందే తమిళ ఆహాకూ శ్రీకారం చుట్టేసింది. అయితే... ఇప్పటికే ఆహాలో చక్కటి గుర్తింపు పొందిన షోస్ ను కాస్తంత విరామం తర్వాత తిరిగి మొదలెడుతోంది. ఈ రకమైన కార్యక్రమాలలో ఆహాకు మంచి గుర్తింపు తెచ్చింది నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్' (Unstoppable) ప్రోగ్రామ్. అలానే ఆహాలో అన్ని వర్గాలను అలరించే కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఆ ఎగ్జైటింగ్ కంటెంట్ లైనప్ ను ఆహా టీమ్ తాజాగా ప్రకటించింది.

ఆహాలో డాన్స్ ప్రోగ్రామ్స్, మూవీస్, కామెడీ షోస్, వెబ్ సీరిస్, కొత్త సినిమాలు వగైరా వగైరాలు ఉంటాయి. తాజాగా ఓంకార్ (Omkar) హోస్ట్ గా ఉన్న డ్యాన్స్ ఐకాన్ 2 (Dance IKON Season 2) వైల్డ్ ఫైర్ తో ఈ యేడాది తన ఎంటర్ టైన్ మెంట్ యాక్షన్ ప్లాన్ ను ఆహా రివీల్ చేసింది. ఫిబ్రవరి 14 నుండి డాన్స్ ఐకాన్ -2 మొదలు కానుంది. ఈ షోలో మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు, యశ్ మాస్టర్, ప్రకృతి కంబం, జాను లైరి మెంటార్స్ గా, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ లుగా వ్యవహరించబోతున్నారు.


రుచికరమైన వంటకాలను పరిచయం చేస్తూ సుమ (Suma) హోస్ట్ గా టేస్టీ ప్రోగ్రాం 'చెఫ్ మంత్ర' (Chef Mantra) సీజన్ 4 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈషా రెబ్బా (Eesha Rebba), కుషిత, రాశి సింగ్, సత్య, హర్ష మరియు ప్రభాస్ శ్రీను కీ రోల్స్ చేసిన వెబ్ సిరీస్ 'త్రీ రోజెస్' సీజన్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలానే రాజ్ తరుణ్, కుషిత కల్లపు నటించిన 'చిరంజీవా' చిత్రం ఆహాలో రిలీజ్ కు రెడీ అవుతోంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'హోమ్ టౌన్' కూడా త్వరలో ఆహా సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులోకి రానుంది. ఇక సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) కామెడీ గేమ్ షో 'సర్కార్ సీజన్ 5' తో గ్రాండ్ గా తిరిగి వస్తోంది. వీటి గురించి ఆహా ఓటీటీ సీయీవో రవికాంత్ సబ్నావీస్ మాట్లాడుతూ, తమకిది ఐదో వార్షికోత్సవం అని, ఈ కీలకమైన సంవత్సరం వీక్షకులకు వినూత్నమైన కంటెంట్ ను ఇవ్వబోతున్నామని తెలిపారు

Updated Date - Feb 15 , 2025 | 06:12 PM