Pahalgam: ఉగ్రదాడిపై విజయ్ దేవరకొండ ఆవేదన

ABN, Publish Date - Apr 23 , 2025 | 11:23 AM

పహల్గామ్ లో జరిగిన ముస్లిం మతోన్మాదుల దాడిని సినిమా రంగంలోని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. భారత ప్రభుత్వం వారికి తగిన బుద్ధి చెప్పాలనికోరుకుంటున్నారు.

జమ్మూ కశ్మీర్ లో సాధారణ పరిస్థితి తీసుకురావాలని ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) దశాబ్దకాలంగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్టికల్ 370ని ఎత్తివేశారు. ఉగ్రవాదులను ఏరివేస్తూ, ఉగ్రవాదులకు మద్దుత్తు నిచ్చే వారిని అదుపు చేస్తూ కశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగానే నాలుగైదేళ్ళుగా సినిమా షూటింగ్స్ తిరిగి కశ్మీర్ లో జరగడం మొదలైంది. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాల తర్వాత తిరిగి సినిమా రంగానికి చెందిన వారు ప్రశాంతంగా జమ్ము కశ్మీర్ కు వెళ్ళి తమ చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను, పాటలను చిత్రీకరించుకుంటున్నారు. మంగళవారం పహల్గామ్ (Pahalgam) లో జరిగి ఉగ్రదాడితో వీరంత ఉలిక్కి పడ్డారు. కశ్మీర్ లో తమ సినిమాల షూటింగ్ జరిగిన రోజులను తలుచుకుని వేదనకు గురయ్యారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సైతం ఇదే అనుభూతికి లోనయ్యాడు.


రెండేళ్ల క్రితం విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషీ' (Khushi) సినిమా షూటింగ్ కశ్మీర్ లోనే జరిగింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే కూడా వచ్చింది. ఆ బర్త్ డే సెలబ్రేషన్స్ ను తాను పహల్గామ్ లోనే జరుపుకున్నానని విజయ్ దేవరకొండ తెలిపారు. ఈ దారుణమైన సంఘటన జరిగిన తర్వాత ఆ రోజుల్లి ఆయన తలుచుకుంటూ, '' రెండేళ్ళ క్రితం పహల్గామ్ లో మా సినిమా షూటింగ్ సమయంలో స్థానిక కశ్మీరీ స్నేహితుల సమక్షంలో చాలా సరదాగా నా పుట్టిన రోజును జరుపుకున్నాను. మంగళవారం జరిగిన సంఘటన చాలా బాధను కలిగిస్తోంది. కొంతమంది ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చడం దారుణమైన విషయం. తుపాకుల వెనుక దాక్కోవడం అనేది అత్యంత హేయమైన, పిరికి చర్య. బాధితులకు, వారి కుటుంబాలకు మేం అండగా నిలుస్తాం. కశ్మీర్ కోసం నిలబడతాం. అతి త్వరలోనే ఉగ్రవాదులకు తగిన గుణపాఠం లభిస్తుందని నేను భావిస్తున్నాను'' అని విజయ్ దేవరకొండ తెలిపారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' (Kingdom) సినిమాలో నటిస్తున్నారు. అది మే 30న విడుదల కావాల్సి ఉంది.

Also Read: Pathala Bhairavi: బి.యన్.రెడ్డి తో యన్టీఆర్ ప్రత్యేక బంధం...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 23 , 2025 | 11:23 AM