Odela -2: విజయ్ వర్మ గురించి దాటేసిన తమన్నా...
ABN, Publish Date - Apr 09 , 2025 | 05:35 PM
మిల్కీ బ్యూటీ తమన్నా ఇవాళ తనకున్న ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్రను 'ఓదెల -2'లో చేస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో ప్రియుడు విజయ్ వర్మ గురించి ఎవరైనా ప్రశ్నించినా... తమన్నా తెలివిగా బదులిస్తోంది.
ప్రముఖ నటి తమన్నా (Tamanna) ను ఇప్పుడు ఎవరైనా మిల్కీ బ్యూటీ అంటే ఆమెకు అంతగా నచ్చడం లేదు. పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తర్వాత దాని మీదనే ఆమె ఆసక్తి చూపుతోంది. ఇంకా మిల్కీ బ్యూటీ లాంటి బిరుదుల్ని తనకు వాడటం ఏమిటనే భావన కూడా ఉండి ఉండొచ్చు!! ఏదేమైనా ఇవాళ జాతీయ స్థాయిలో తమన్నాకు ఐటమ్ గర్ల్ గానూ మంచి పేరే ఉంది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా తమన్నాను ఐటమ్ సాంగ్స్ కు వాడేసుకుంటున్నారు. మంచి విజయాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఆ మధ్య విజయ్ వర్మ (Vijay Varma) తో కలిసి హిందీ వెబ్ సీరీస్ లో హద్దులేని శృంగారాన్ని తమన్నా ఒలకబోసిన దగ్గర నుండి... ఆమెకు యూత్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. సోషల్ మీడియాలోనూ తమన్నా ఎరోటిక్ వీడియో క్లిప్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమన్నా తనకు ఇప్పుడున్న ఇమేజ్ కు పూర్తి భిన్నంగా 'ఓదెల -2' (Odela -2) చిత్రంలో శివయోగిగా నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే... తమన్నాది అందులో ఎంత కీలకమైన పాత్రనో అర్థమౌతోంది. దుష్టశక్తులకు గుణపాఠం చెప్పే దైవాంశ సంభూతురాలిగా తమన్నా ఈ సినిమాలో కనిపించబోతోంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న 'ఓదెల -2' ప్రమోషన్స్ లోనూ తమన్నా పాల్గొంటోంది.
ప్రేమజంట తమన్నా, విజయ్ వర్మ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని, వీరిద్దరూ విడిపోయారని కొంతకాలంగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దానికి తగ్గట్టుగానే గతంలో కలిసి మెలిసి పబ్లిక్ అప్పీయరెన్స్ ఇచ్చిన వీరిద్దరూ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య హోలీ పండగ సమయంలోనూ విడివిడిగానే బాలీవుడ్ లో జరిగిన ఓ పార్టీకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తమన్నాను విజయ్ వర్మ గురించి ఏం అడిగా... స్ట్రయిట్ ఫార్వర్డ్ గా సమాధానం చెప్పకుండా దాట వేస్తోంది. 'ఓదెల -2' ప్రమోషన్స్ లోనూ అదే జరిగింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఓ జర్నలిస్ట్ ''మంత్ర, తంత్రాలను ఉపయోగించి ఎవరినైనా మీరు లొంగదీసుకోవాలని లేదా వారిపై విజయం సాధించాలని అనుకుంటున్నారా?'' అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నలోని శ్లేషను గుర్తించిన తమన్నా... విజయ్ వర్మ పేరును ప్రస్తావించకుండానే తనదైన రీతిలో బదులిచ్చింది. ''అలా ఎవరినైనా లొంగదీసుకోవాలని అనుకుంటే అది మీరే అవుతారు! మీలాంటి జర్నలిస్టులను లొంగదీసుకుంటే.. మీరు, ఫోటోగ్రాఫర్స్ అంతా నా అరచేతిలోకి వచ్చేస్తారు. అప్పుడు నేను చెప్పిందే మీరంతా చేస్తారు. మీ మీద మంత్రతంత్రాలను ఉపయోగించమంటారా... చెప్పండి!?'' అని నవ్వుతూ అనేసింది. మొత్తానికి విజయ్ వర్మతో బ్రేకప్ గురించి చెప్పకుండా... తమన్నా తెలివినంత ఉపయోగించి బాగానే తప్పించుకుంటోంది.
Also Read: Allu Arjun: యెద లోతుల నుండీ...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి