Priyanka Mohan: ప్రియాంక ఆరుల్‌ మోహన్‌ చేతులమీదుగా గ్జితీ వీవ్స్‌ ప్రారంభం

ABN, Publish Date - Feb 18 , 2025 | 11:56 PM

'ఓజి' ఫేమ్  ప్రియాంక ఆరుల్‌ మోహన్‌ హైదరాబాద్‌లో సందడి చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం45లో 'గ్జితీ వీవ్స్‌' పేరుతో నూతన వస్త్రాలయాన్ని ఆమె ప్రారంభించారు.

'ఓజి' ఫేమ్  ప్రియాంక ఆరుల్‌ మోహన్‌ హైదరాబాద్‌లో సందడి చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం45లో 'గ్జితీ వీవ్స్‌' (Xiti Weaves) పేరుతో నూతన వస్త్రాలయాన్ని ఆమె ప్రారంభించారు. గ్జ్జితి మేనేజింగ్‌ డైరెక్టర్లు సౌజన్య, బాబీ తిక్క మరియు టి.శ్రీనివాస్‌తో కలిసి నూతన స్టోర్‌ను ఆమె ఆవిష్కరించారు. ’’ప్రతి కారణానికి చీర, ప్రతి సీజన్‌కి చీర’ అందించడానికి గ్జితి వీవ్స్‌ సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు.  (Priyanka Arul Mohan Launches Xiti Weaves)



‘‘చీరలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. పట్లు వస్త్రాలు సంప్రదాయం, గాంభీర్యాన్ని సూచిస్తాయి. గ్జితీ వీవ్స్‌ కలెక్షన్ప్‌ చూస్తుంటే కళ్లు చెదురుతున్నాయి. పట్లు వస్త్రాలు ఎంతో కలర్‌ఫుల్‌గా నాణ్యంగా ఉన్నాయి. ఈ స్టోర్‌ చూశాక.. చీరలపై వీరికున్న పాషన్‌ ఏంటో నాకు అర్థమైంది. ఈ స్టోర్‌ ఓ కొత్త ప్రపంచంలా ఉంది. దీని ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా థాంక్స్‌’’ అని అన్నారు. నాని గ్యాంగ్‌లీడర్‌, శ్రీకారం, సరిపోదా శనివారం చిత్రాలతో ఆకట్టుకున్న ప్రియాంక ప్రస్తుతం పవ్‌కల్యాణ్‌తో ఓజీ చిత్రంలో నటిస్తోంది. సుజీత్‌ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (Priyanka Arul Mohan)


Updated Date - Feb 18 , 2025 | 11:56 PM