Janani: గ్రాండ్ గా జనని అయ్యర్ నిశ్చితార్థం
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:24 PM
ప్రముఖ మోడల్, నటి జననీ అయ్యర్ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతోంది. పైలెట్ సాయి రోషన్ శ్యామ్ తో ఆమె వివాహ నిశ్చితార్థం జరిగింది.
సినీ ఇండస్ట్రీకి పెళ్లి కళ వచ్చేసింది. ఒకరి తర్వాత మరొకరు పెళ్లి బాట పడుతున్నారు. ఇన్నాళ్లు బ్యాచిలర్స్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన హీరోహీరోయిన్లు... కొత్తజీవితంలోకి అడుగుపెడుతున్నారు. కొందరు మనసుకు నచ్చినవాడిని పెళ్లి చేసుకుంటే... మరికొందరు పెద్దలు కుదిర్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. బుధవారం దివ్వాంగురాలు, నటి అభినయ (Abhinaya) వివాహబంధంలోకి అడుగుపెట్టగా... మరో బ్యూటీ కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది.
తమిళ నటి జనని అయ్యర్ (Janani Iyer) నిశ్చితార్థం (Engagement) చేసుకున్నారు. పైలట్ సాయి రోషన్ శ్యామ్ (Sai Roshan Shyam) తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేయగా, అవి వైరల్ గా మారాయి. బంధువులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ తంతులో జననీ ఫుల్-స్లీవ్స్ హెవీ ఎంబ్రాయిడరీ లెహంగా లో అందంగా మెరిసిపోగా... ఆమె కాబోయే భర్త పాస్టెల్ షేడ్ షేర్వానీ లో కనిపించాడు. ఈ ఇద్దరు కలిసి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఫోటోలకు సోషల్ మీడియా వేదిక కాగా, సెలబ్రెటీలతో పాటు ఫ్యాన్స్, ఫాలోవర్స్ కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. చూడముచ్చటగా ఉన్నారంటూ ఈ జోడీని ఆశీర్వదించారు.
చెన్నైలో పుట్టి పెరిగిన జనని... స్కూల్, కాలేజీ ఎడ్యుకేషన్ తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఆ పైన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. బాలా దర్శకత్వంలో 'అవన్ ఇవన్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. విశాల్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో 'వాడే వీడు' పేరుతో డబ్ అయ్యింది. జననీ.. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది. ''తేగిడి, బగీరా, బెలూన్, హాట్ స్పాట్ '' తదితర చిత్రాలలో నటించింది. ఆ మధ్య బిగ్ బాస్ రియాలిటి గేమ్ షో-2లో కూడా జననీ పాల్గొంది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం కావడంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యందీ భామ. అయితే మ్యారేజ్ డేట్ ను మాత్రం అమ్మడు ఇంకా ప్రకటించలేదు.
Also Read: Bhaskhar Maurya: ముత్తయ్య పాట ఆవిష్కరించిన సమంత
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి