Priyanka Chopra: యాక్షన్ వైబ్స్‌తో హెడ్స్ ఆఫ్ స్టేట్ ట్రైలర్

ABN, Publish Date - Apr 24 , 2025 | 03:57 PM

ప్రియాంక నటించిన మరో హాలీవుడ్ బిగ్గీ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ యాక్షన్ వైబ్స్‌తో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

బాలీవుడ్‌, హాలీవుడ్లో స్టార్ డమ్ తో వెలిగిపోతున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గ్లోబల్ ఐకాన్‌గా దూసుకుపోతోంది. ఇప్పటికే ''బేవాచ్, క్వాంటికో, సిటాడెల్'' తో హాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా మారిన ఈ బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్‌లో దర్శకుడు రాజమౌళి (Rajamouli), మహేష్ బాబు (Mahesh Babu) కాంబో సినిమాతో రచ్చ చేయబోతోంది. ఈ సినిమాకి ప్రియాంక గ్లోబల్ ఫాలోయింగ్... ఓ రేంజ్ లో మార్కెట్ వైబ్ తెస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే అంతకు ముందే ఈ అమ్మడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది.


ప్రియాంక నటించిన మరో హాలీవుడ్ బిగ్గీ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ (Heads of State) ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ యాక్షన్ వైబ్స్‌తో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. జాన్ సీనా (John Cena), ఇద్రిస్ ఎల్బా(Idris Elba)లతో కలిసి ప్రియాంక యాక్షన్ సీన్స్‌లో హైలైట్ గా కనిపించింది. జాన్ సీనా అమెరికన్ ప్రెసిడెంట్‌గా, ఇద్రిస్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్‌గా కీ- రోల్స్‌లో మెరిశారు. కథలో ట్విస్ట్ ఏంటంటే, ఈ ఇద్దరూ సూపర్ సెక్యూరిటీని బ్రేక్ చేసి ఓ సీక్రెట్ లొకేషన్‌లో లాండ్ అవుతారు. విమాన ప్రమాదంతో వీళ్లు ఎక్కడ ల్యాండ్ అయ్యారో ఎవరికీ తెలీదు. అయినా శత్రువులు వీళ్లని వదలరు. అప్పుడు సీన్‌లోకి ఎంటర్ అవుతుంది గ్లోబల్ స్టార్ ప్రియాంక. 'ఎం.ఐ. 6' ఏజెంట్ నోయెల్ బిస్సిట్‌గా ఆమె రోల్ ఏంటి? ఆ ఇద్దరిని ఎలా కాపాడింది? అన్నది మిగతా స్టోరీ.

ట్రైలర్ సింపుల్‌గా కనిపించినా, ఫుల్ థ్రిల్లింగ్ ఎపిసోడ్స్‌తో రక్తి కట్టిస్తోంది. యాక్షన్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌తో ఈ సినిమా నెక్స్ట్ లెవల్‌గా ఉంటుందని ట్రైలర్ చెబుతోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అమెజాన్ ప్రైమ్‌లో జూలైలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: SS Rajamouli: రవాణా శాఖ కార్యాలయంలో రాజమౌళి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 24 , 2025 | 03:57 PM