Mission impossible 8: అనుకున్న దానికంటే ముందే..

ABN, Publish Date - Apr 25 , 2025 | 03:47 PM

హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘మిషన్‌ ఇంపాసిబుల్‌: ద ఫైనల్‌ రెకనింగ్‌’. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో క్రిస్టోఫర్‌ మేక్‌క్వారీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ (Tom Cruise) కీలక పాత్ర పోషించిన చిత్రం ‘మిషన్‌ ఇంపాసిబుల్‌: ద ఫైనల్‌ రెకనింగ్‌’ (Mission impossible – the final reckoning). స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో క్రిస్టోఫర్‌ మేక్‌క్వారీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న చిత్రం ఈ సినిమా ఫ్రాంచైజీల్లో భాగంగా రూపొందిన ఎనిమిదో చిత్రమిది.  మే 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా విడుదల తేదీని మార్చినట్లు వెల్లడించారు. అనుకున్న సమయం కంటే ముందే ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు తాజాగా చెప్పారు. మే17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - Apr 25 , 2025 | 03:47 PM