Gene Hackman: నటుడు జీన్‌ హాక్‌మన్ మరణానికి కారణం ఇదే

ABN, Publish Date - Mar 09 , 2025 | 07:41 AM

హాలీవుడ్‌ నటుడు జీన్‌ హాక్‌మన్, అతని భార్య బెట్సీ అరకావా మరణానికి సంబంధించిన పలు విషయాలను బయటకు వచ్చాయి.

హాలీవుడ్‌ నటుడు జీన్‌ హాక్‌మన్(GeneHackmanPassesAway), అతని భార్య బెట్సీ అరకావా (Betsy Arakawa) మరణం  ఓ మిస్టరీగా మిగిలిన సంగతి తెలిసిందే. తాజాగా వారి మరణానికి సంబంధించిన పలు విషయాలను శుక్రవారం బయటకు వచ్చాయి.  న్యూ మెక్సీకోలోని తమ ఇంట్లో బెట్సీ అరకావా ‘హాంటా వైరస్‌’ (Hantavirus)కారణంగా మరణించారు. ఆ తర్వాత వారం రోజులకు జీన్‌ హాక్‌మన్‌ గుండె జబ్బుతో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.


డా.హెదర్‌ జారెల్‌ మాట్లాడుతూ.. ‘‘రెండు మరణాలు సహజంగా జరిగినవే. జీన్‌ హాక్‌మన్‌కు అల్జీమర్స్‌ పెరిగిపోవడంతో తన భార్య మరణించిందనే విషయాన్ని ఆయన గుర్తించలేక పోయారు’’ అని అన్నారు. హాంటా వైరస్‌ గురించి చెబుతూ.. ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది.  కానీ మానవులకు అంత త్వరగా ఈ వ్యాధి సోకదు. దీనికి మందులు ఏమీ ఉండవు. ముందస్తు జాగ్రత్త పాటించడమే మార్గం" అని  చెప్పారు.  

Updated Date - Mar 09 , 2025 | 08:08 AM