Coldplay: రూ. 12 వేల టిక్కెట్.. లక్షన్నరకు కొనుక్కుని కన్సర్ట్‌కి వెళితే.. ‘లైబ్రరీ‌లో కంటే సైలెంట్‌గా’!

ABN, Publish Date - Jan 20 , 2025 | 04:38 PM

ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందిన కోల్డ్ ప్లే బ్యాండ్.. భారతదేశంలో తమ రెండో ప్రదర్శనను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ప్రదర్శన నిమిత్తం మొదలైన టూర్‌లో భాగంగా ఇటీవల ముంబైలో కన్సర్ట్ జరగగా.. ఈ కన్సర్ట్‌కు హాజరైన వారు కొందరు ఈ బ్యాండ్ పరువు తీసేలా కామెంట్స్, వీడియోలు షేర్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే..

Coldplay Gang

90స్ చివరి నుండి పాప్-రాక్ యాక్ట్‌లతో బ్రిటన్ పాప్ బ్యాండ్ కోల్డ్‌ ప్లే అత్యంత ప్రభావవంతమైన బ్యాండ్‌గా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ‘యెల్లో, ది సైంటిస్ట్ మరియు ఎ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ వంటి విజయాలకు పేరుగాంచిన కోల్డ్‌ ప్లే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుని, విజయయాత్రని కొనసాగిస్తోంది. భారతదేశంలో ఈ పాపులర్ బ్యాండ్ తమ రెండవ ప్రదర్శనకి సిద్ధమైంది. రిపబ్లిక్‌‌ డే‌ని పురస్కరించుకుని జనవరి 25 మరియు 26 తేదీలలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ బ్యాండ్ రెండవ ప్రదర్శనను ఇవ్వబోతోంది. అయితే, ఈ బ్యాండ్ మొదటి ప్రదర్శన నవంబర్ 2016లో ఇవ్వగా.. మళ్లీ 8 సంవత్సరాల తర్వాత భారత్‌లో రెండవ ప్రదర్శనను ఇవ్వబోతోంది.


Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

ఈ కన్సర్ట్ నిమిత్తం ఇప్పటికే ముంబైలో మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ టూర్‌ను ప్రారంభించగా.. ఈ ఈవెంట్ టిక్కెట్లు బుక్ మై షో‌లో హాట్ కేక్‌లా అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచాయి. బుక్‌ మై షోలో టికెట్ల విక్రయం మొదలైన సెకన్లలోనే అమ్ముడవడంతో పాటు.. అదే టికెట్లను మళ్లీ విక్రయించగా రూ. 12000 ఉన్న టిక్కెట్ ₹1.5 లక్షల వరకు ధర పలికినట్లుగా తెలుస్తోంది. టికెట్ల ధర విషయంలో ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం జరిగిన ఈ బ్యాండ్ కన్సర్ట్.. టికెట్ కొన్నవారిని తీవ్ర నిరాశకు గురి చేసినట్లుగా.. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న కొన్ని వీడియోలు, కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతోంది.


ముంబైలో జరిగిన ఈ ఈవెంట్ తర్వాత సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టా, ఎక్స్ లలో హాజరైన వారు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. బుక్ మై షో లో ఒక్క టికెట్ కూడా లేదు అన్నట్లుగా చూపించారు.. కానీ ఈ క్రేజ్ ఈ వేడుకలో లేదు.. లైబ్రరీలో కంటే సైలెంట్‌గా జనం కూర్చున్నారు అంటూ ఈవెంట్ వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేస్తే.. ‘ఇది కన్సర్ట్ కాదు నాటకం’ అంటూ మరో నెటిజన్‌ తను తీసిన వీడియోను షేర్ చేశాడు. ఇదిలా ఉంటే కొందరు నెటిజన్లు మాత్రం కోల్డ్ ప్లే యూనిట్‌కు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఈ కన్సర్ట్ చూసి ఎంజాయ్ చేయడానికి రాలేదు.. ఫొటోలు, వీడియోలు తీసుకుని రీల్స్ చేయడానికే వచ్చినట్లుగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్న వారికి కౌంటర్స్ ఇస్తున్నారు. ఓవరాల్‌గా అయితే అధిక ధరతో టికెట్లు కొన్నవాళ్లు.. ఆ మోతాదులో ఎంజాయ్ చేయలేకపోయారని, వారి అంచనాలను ఈ కన్సర్ట్ టూర్ అందుకోలేదనేది మాత్రం వారి వీడియోలతో స్పష్టమవుతోంది. జనవరి 25 మరియు 26 తేదీలలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే బిగ్ కన్సర్ట్‌కు ప్రధాన గాయకుడు క్రిస్ మార్టిన్, బేసిస్ట్ గై బెర్రీమాన్, గిటారిస్ట్ జానీ బక్‌ల్యాండ్ మరియు డ్రమ్మర్ విల్ ఛాంపియన్‌లతో కూడిన కోల్డ్‌ ప్లే బ్యాండ్ మొత్తం హాజరుకానుందని తెలుస్తోంది.


Also Read-Pushpa 2: సంధ్యలో పుష్ప గాడి ర్యాంపేజ్..

Also Read-Chiranjeevi - Venkatesh: చిరంజీవి తర్వాత వెంకటేష్..

Also Read-Hari Hara Veera Mallu: పవన్ అంటే భయం లేదా..

Also Read-Balakrishna: బాలయ్య సెంటి‌‌మెంట్ ఏంటో తెలుసా

మా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 20 , 2025 | 05:05 PM