Coldplay: 'కోల్డ్ ప్లే' కన్సర్ట్‌లో మార్మోగిన తెలంగాణ పేరు
ABN, Publish Date - Jan 28 , 2025 | 03:40 PM
Coldplay: 'కోల్డ్ ప్లే' పాటగాడు 'క్రిస్ మార్టిన్' ఈ బ్యాండ్ కు ముఖ చిత్రంగా కనిపిస్తాడు. ఆయన ఈ కన్సర్ట్ లో పాడుతూ.. "ఐయామ్ ఫ్రమ్ తెలంగాణ" (నేను తెలంగాణ వాడిని) అంటూ చెప్పుకొచ్చాడు. గ్రేట్ బ్రిటన్ లో పుట్టిన క్రిస్ మార్టిన్ కి తెలంగాణతో ఏం సంబంధం అనుకుంటున్నారా?
ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ 'కోల్డ్ ప్లే' ఇండియన్ టూర్ ముగిసింది. మొదట ముంబైలో చప్పగా సాగిన ఈ కన్సర్ట్.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మాత్రం ఉర్రూతలూగించింది. బాలీవుడ్ 'బాద్ షా' షారుఖ్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా పలువురు ఇండియన్ సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. ఒక బ్రిటన్ రాక్ బ్యాండ్, హాలీవుడ్ లో నంబర్ 1, ప్రపంచవ్యాప్తంగా క్రేజీ ఫాలోయింగ్. మరి వీళ్ళకి తెలంగాణతో సంబంధం ఏంటంటారా?
'కోల్డ్ ప్లే' పాటగాడు 'క్రిస్ మార్టిన్' ఈ బ్యాండ్ కు ముఖ చిత్రంగా కనిపిస్తాడు. ఆయన ఈ కన్సర్ట్ లో పాడుతూ.. "ఐయామ్ ఫ్రమ్ తెలంగాణ" (నేను తెలంగాణ వాడిని) అంటూ చెప్పుకొచ్చాడు. గ్రేట్ బ్రిటన్ లో పుట్టిన క్రిస్ మార్టిన్ కి తెలంగాణతో ఏం సంబంధం అనుకుంటున్నారా? 'కోల్డ్ ప్లే' ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అక్కడి వాళ్ళం అని చెప్పుకుంటారు. ముంబైలో టూర్ చేసినప్పుడు ముంబై వాళ్ళం అని చెప్పుకున్నారు. కానీ.. అహ్మదాబాద్ లో మాత్రం తెలంగాణ వాడిని అని క్రిస్ మార్టిన్ చెప్పడం విశేషం. క్రిస్ అహ్మదాబాద్ వాడిని చెబుతాడని అంతా భావించారు. అలాగే 'గై బెర్రీమాన్' వైపు చూపిస్తూ ఇతను స్కాట్లాండ్ వాడిలా కనిపిస్తాడు. కానీ.. తమిళనాడుకు చెందిన వాడని చెప్పాడు.
దీంతో తెలంగాణ ప్రజలు క్రిస్ మార్టిన్ తెలంగాణ ముద్దు బిడ్డ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకా మీమర్స్ అయితే.. మాదాపూర్ మార్టిన్ కు కేసీఆర్ తాత అవుతాడు, సీఎం రేవంత్ మామ అవుతాడు, హైదరాబాదీ సింగర్ క్లెమెంట్ అన్నతో కోలాబ్ చేయాలంటూ ఫన్నీగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వాస్తవానికి గత పదేళ్ల నుండి హైదరాబాద్ పేరు అంతర్జాతీయంగా మార్మోగుతుంది.