67th Grammy Awards: గ్రామీ అవార్డు వేడుక.. వేదికపై దుస్తులు తీసేసి..

ABN, Publish Date - Feb 03 , 2025 | 11:18 AM

గ్రామీ అవార్డు వేడుకల్లో భారత సంతతికి చెందిన అమెరికన్‌ సింగర్‌, వ్యాపారవేత్త చంద్రికా టాండన్‌ (Chandrika tondon) అవార్డు అందుకున్నారు. ఆమె రూపొందించిన ‘త్రివేణి’ (Triveni Album) ఆల్బమ్‌ బెస్ట్‌ న్యూ ఏజ్‌ యాంబియంట్‌ ఆర్‌ చాంట్‌ ఆల్బమ్‌గా అవార్డు సొంతం చేసుకుంది.

ప్రపంచ సంగీత రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 67వ గ్రామీ అవార్డుల ( Grammy Awards) వేడుక తాజాగా వైభవంగా జరిగింది. లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరిగిన ఈ వేడుకలో పేరుపొందిన సింగర్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ (Singer And Music Director) సందడి చేశారు. ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన అమెరికన్‌ సింగర్‌, వ్యాపారవేత్త చంద్రికా టాండన్‌ (Chandrika tondon) అవార్డు అందుకున్నారు. ఆమె రూపొందించిన ‘త్రివేణి’ (Triveni Album) ఆల్బమ్‌ బెస్ట్‌ న్యూ ఏజ్‌ యాంబియంట్‌ ఆర్‌ చాంట్‌ ఆల్బమ్‌గా అవార్డు సొంతం చేసుకుంది. దీనిపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు ఎంపిక చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. చంద్రికకు ఇది రెండో గ్రామీ నామినేషన్‌ కావడం విశేషం.


అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీకార్టర్‌ మరణానంతరం ఆయనను గ్రామీ పురస్కారం వరించింది. ఆయన రచించిన ‘ది లాస్ట్‌ సండేస్‌ ఇన్‌ ప్లేన్స్‌’కు బెస్ట్‌ ఆడియో బుక్‌ నెరేషన్‌ విభాగంలో అవార్డు వరించింది. జిమ్మీకార్టర్‌ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన మనవడు జేసన్‌ కార్టర్‌ ఈ అవార్డును అందుకున్నారు.

ఎందుకు అలా ప్రవర్తించారో...

అమెరికన్‌ ర్యాపర్‌ కాన్యే వెస్ట్‌, ఆయన సతీమణి బియాంకా సెన్సోరి వివాదంలో నిలిచారు. అవార్డు వేడుకకు హాజరైన ఈ దంపతులు విచిత్రంగా ప్రవర్తించారు. రెడ్‌ కార్పెట్‌పై నడుస్తున్న సమయంలో బియాంక ఉన్నట్టుండి తన దుస్తులు తీసేసి ఫొటోలకు పోజులిచ్చారు. ఆమె ప్రవర్తనతో అక్కడ గందరగోళం నెలకొంది. త్వరితగతిన స్పందించిన సిబ్బంది ఈ దంపతులను అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. అయితే బియాంక ఎందుకు అలా ప్రవర్తించారో తెలియరాలేదు.


అవార్డు అందుకున్న చంద్రికా టాండన్‌ మాట్లాడుతూ "చాలా అద్భుతంగా ఉంది. ఈ విభాగంలో నాతోపాటు ఎంతోమంది గొప్ప గాయనీ గాయకులు, కంపోజర్లు నామినేట్‌ అయ్యారు. వారందరితో పాటు నేనూ విజయాన్ని అందుకోవడం సంతోషంగా అనిపిస్తుంది’’ అని అన్నారు. చెన్నైలో పెరిగిన చంద్రిక ప్రస్తుతం విదేశాల్లో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.

కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం ఎంతోమంది జీవితాల్లో విషాదం మిగిల్చింది. కార్చిచ్చు కారణంగా జీవితాన్ని కోల్పోయిన బాధితులకు ఈ వేడుకలో సంతాపం ప్రకటించారు. అక్కడి జీవన స్థితిగతులు త్వరగా సాధారణ స్థితికి రావాలని కోరుకున్నారు. ఈ వేడుక నిర్వహణ ద్వారా వచ్చిన డబ్బును కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల సహాయార్థం ఉపయోగించనున్నారని అక్కడి మీడియా తెలిపింది.

Updated Date - Feb 03 , 2025 | 11:19 AM