Daaku Maharaaj Review: బాలయ్య నటించిన మాస్ మసాలా మూవీ ‘డాకు మహారాజ్’ ఎలా ఉందంటే 

ABN, Publish Date - Jan 12 , 2025 | 01:04 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్' సంక్రాంతి కానుకగా ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాల్తేరు వీరయ్య  తర్వాత బాబీ నుంచి వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందంటే 

సినిమా రివ్యూ: 'డాకు మహారాజ్‌' (Daaku Maharaaj)
విడుదల తేది: 12–01–2025
నటీనటులు: నందమూరి బాలకృష్ణ; ప్రగ్యాజైస్వాల్‌,  బాబీ దేవోల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, మకరంద్‌దేశ్‌ పాండే, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సచిన్‌ ఖేడేకర్‌, హిమజ, దివి, హర్షవర్థన్‌ తదితరులు.


కెమెరా: విజయ్‌కార్తిక్‌,
ఎడిటింగ్‌: నిరంజన్‌ దేవరమానే, రూబెన్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) - KS Ravindra)

మాస్‌ యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌ గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ.. ఆయనతో సినిమా అంటే దర్శకులకు ప్రత్యేకమైన ఉత్సాహం ఉంటుంది.  సినిమా ప్రకటించి, విడుదల చేసిన గ్లింప్స్‌తోనే ఈ చిత్రం ఎంత మాసీగా ఉంటుందో చూపించాడు దర్శకుడు బాబీ. బాలయ్యలో మరో యాంగిల్‌ చూపించే ప్రయత్నం అనిపించింది. ఆయన నటించిన ఈ చిత్రం సంక్రాంతి గిఫ్ట్‌గా ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంతో బాలయ్య హిట్‌ అందుకున్నాడా? సంక్రాంతి హిట్‌ పరంపరను కొనసాగించాడా? సంక్రాంతి హిట్‌కు బోణీ కొట్టాడా? అన్నది చూద్దాం.


కథ: (Daaku Maharaaj Story line)
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి(సచిన్‌ ఖేడ్కర్‌)విద్యావేత్త. ఓ పెద్ద స్కూల్‌ని నడుపుతుంటాడు. తనకు పెద్ద కాఫీ ఎస్టేట్‌ ఉంటుంది. దాన్ని లీజుకి తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు (రవి కిషన్‌) అక్కడ వన్య మృగాలను అక్రమంగా తరలిస్తుంటాడు. త్రిమూర్తులు అరాచకాలు హద్దుమీరడంతో పోలీసులు ఆశ్రయిస్తాడు కృష్ణమూర్తి. దీంతో పగ పెంచుకున్న త్రిమూర్తులు, కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ప్రాణహాని తలపెట్టడానికి కిడ్నాప్‌ చేస్తాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఆ ఇంట్లో పని చేస్తున్న మకరంద్‌ దేశపాండే చంబల్‌లోని మోస్ట్‌ వాంటెడ్‌ మహారాజ్‌ (బాలకృష్ణ)కు కబురు పెడతాడు. మహారాజ్‌ నానాజీగా పేరు మార్చుకొని ఆ పాపకు చ రక్షణగా ఉండటానికి వస్తాడు. అసలు ఈ మహారాజ్‌ ఎవరు? ఆ పాపకి తనతో వున్న సంబంధం ఏమిటి? ఈ కథలో బల్వంత్‌ ఠాకూర్‌ (బాబీ డియోల్‌) నందిని (శ్రద్థా శ్రీనాథ్‌) ఎవరు? అసలు మహారాజ్‌, నానాజీగా పేరు ఎందుకు మార్చుకున్నాడు. తన శత్రువర్గం ఎవరు అన్నది తెరపైనే చూడాలి.


విశ్లేషణ: (
Daaku Maharaaj Review)


ఆట షురూ అంటూ పక్కా మాస్‌ యాంగిల్‌లో ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. దిగటమే ఊచ కోత. ఇలాంటి మాస్‌  కథలను కొత్తగా చూపించలాంటే దర్శకులకు సవాలే. బాలయ్యలో పక్కా యాక్షన్‌ సినిమా అంటే అన్ని సమపాళ్లల్లో ఉండాలి. ఏదీ కూడా అటు ఇటు కాకూడదు. ఎందుకంటే బాలయ్య మాస్‌ యాక్షన్‌ సినిమాలకు డిక్షనరీవాంటి నటుడు. ఆయన డిక్షనరీలో ఇలాంటి మాస్‌ సినిమాలెన్నో. ఆ విషయంలో దర్శకుడ బాబీ బ్యాలెన్స్‌డ్‌ ఉన్నారు. కథ రొటీన్‌ అయినా తెరకెక్కించడంలో దర్శకుడు కొత్తదనం, ఎఫర్ట్‌ కనిపించింది. బాలకృష్ణకు పర్ఫెక్ట్‌గా యాప్ట్‌ అయ్యే కథకు చంబల్‌ ప్రాంతానికి తరలించి కథకు కొత్త కలర్‌ పూశారు. కథా నేపథ్యం మాత్రమే కాదు. యాక్షన్‌ పార్ట్‌ మొత్తం  సగటు తెలుగు, మాస్‌ కమర్షియల్‌ సినిమాకి భిన్నంగా హాలీవుడ్‌ స్లీక్‌ యాక్షన్‌ని తలపించేలా చేశారు.  హీరో ఎప్పుడూ చెడు మీద పోరాటం చేసి గెలుస్లాడు. అది పరమ రొటీన్‌ ఫార్మెట్‌ అయినా స్ర్కీన్‌ ప్లే, యాక్షన్‌ లో చూపించిన వైవిఽధ్యం ఈ చిత్రానికి కొత్త తరహా గ్లామర్‌ తీసుకొచ్చింది. కృష్ణమూర్తి కుటుంబం, పాప, ఎమ్మెల్యే త్రిమూర్తులు, అతడి తమ్ముడు ఈ మూడు పాత్రలు చుట్టూ తిరిగిన కథ కాస్త నెమ్మదిగా సాగుతాయి. నానాజీగా బాలయ్య ఎంట్రీతో సినిమా జెట్‌ స్పీడ్‌ అందుకుంటుంది. ఫస్టాఫ్‌ పాప ఎమోషన్‌ని ఎలివేట్‌ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. మరోవైపు స్పెషల్‌ ఆఫీసర్‌ స్టీఫెన్‌ రాజ్‌ (షైన్‌ టామ్‌ చాకో) డాకు గురించి చేసే అన్వేషణ డాకూ పాత్ర పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అక్కడ ఫైట్‌ సీక్వెన్స్‌ తర్వాత వచ్చే డబిడి దిబిడి సాంగ్‌ రాకతో థియేటర్‌ దద్దరిల్లింది. దర్శకుడు చెప్పినట్లుగా ఇంటర్వెల్‌ హైలెట్‌గా నిలిచింది. 15 నిమిషాల ఆ సీన్‌ అభిమానులకు పండగే. (God of MAsses) NBK)

అసలు డాకూ మహారాజ్‌ అంటే ఏంటో, ఎవరో సెకెండాఫ్‌లో తెలుస్తుంది. నీటి కోసం అల్లాడుతున్న చంబల్‌ ప్రజల బాధ ప్రేక్షకులకు భావోద్వేగానికి కలిగిస్తుంది. ఆ సీన్‌లో సివిల్‌ ఇంజనీర్‌ సీతారామ్‌గా బాలయ్య కనిపించిన తీరు.. తనని డాకులా మార్చిన పరిస్థితులు బాలయ్య నేచర్‌కి సరిపడేలా ఉంది. అయితే ఇక్కడ బాలయ్యకు ఓవర్‌ హైప్‌ లేకుండా చాలా బ్యాలెన్స్‌గా చూపించారు. సెకండ్‌ హాఫ్‌లో హై అని చెప్పుకునే సన్నివేశాలు చాలానే ఉన్నాయి.  కలెక్టర్‌ ప్యాలెస్‌ సీన్‌, విలన్‌ ఇంటి ముందు పోరాటఘట్టాలు, ఇసుక తుఫాన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ ప్రత్యేకంగా నిలుస్తాయి. అయితే సెకెండాఫ్‌ ఎక్కువ శాతం విలన్‌ కథే నడుస్తుంది. సినిమాలో ఉన్న హై మోమెంట్స్‌ పక్కన పెడితే విలన్‌ సీన్స్‌ కాస్త బోర్‌ కొట్టిస్తాయి. హింసాత్మక సన్నివేశాలు ఎక్కువే ఉన్నాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు..
బాలయ్యకు ఈ తరహా పాత్రలో కొత్తేమీ కాదు. అలవోకగా చేసుకెళ్లిపోతారు. దబిడిదిడిబే అనేలా లౌడ్‌ వాయిప్‌ లేకుండా స్మూత్‌గా బాలకృష్ణ పాత్రను తీర్చిదిద్దారు. బాలయ్య మాత్రం కొత్తగా కనిపించారు. అయితే మాస్‌ అంశాలను ఆకట్టుకోవడం బాలయ్య బలం. దాంతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన పిండేస్తారు. కానీ ఈ సినిమాలో అది మిస్‌ అయింది. నీళ్లు అడిగిందన్న పాపానికి ఓ చిన్న పిల్లను, ఆ ఊరిని తగలబెట్టిన విలన్‌ గ్యాంగ్‌ ఇంటికి వెళ్లి ఊచ కోత కోసి, నందిని పాత్రధారి శ్రద్ధాతో పలికే సంభాషణల్లో బాలయ్య తరహా ఎమోషన్స్‌ మిస్‌ అయిన భావన కలిగింది. అక్కడక్కడా బాలయ్య తరహా పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు వదిలి ఉంటే బావుండేది. ప్రగ్యా జైస్వాల్‌ పాత్ర ఓకే అనిపించింది. కలెక్టర్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ పాత్ర మంచి ప్రాధాన్యం ఉంది. నటన పరంగా కూడా ఆకట్టుకుంది. బాబీ డియోల్‌ ప్రజెన్స్‌ ఆకట్టుకుంది. ఊర్వశి రౌతేలా కాసేపు అలరించింది. దబడిదిబిడి పాటతో ఉర్రూతలూగించింది. మకరంద్‌ దేశ్‌ పాండే చంబల్‌ బ్యాక్‌ డ్రాప్‌కి యాప్ట్‌ అయ్యారు. సచిన్‌ ఖేడ్కర్‌, చాందిని చౌదరి, పాపగా నటించిన బాలనటి పాత్రలు డీసెంట్‌గా ఉన్నాయి. రవి కిషన్‌ పాత్ర గమ్మత్తుగా వుంటుంది. సందీప్‌ రాజ్‌ మేనరిజం, డైలాగ్‌ డిక్షన్‌ నవ్వులు పూయిస్తుంది. మిగతా ఆర్టిస్ట్‌లు పరిధి మేరకు నటించారు.  బాలయ్యతో సినిమా అంటే తమన్‌కు డబుల్‌ ఎనర్జీ వస్తుంది. అఖండ తర్వాత మరోసారి పూనకాలు తెప్పించే ఆర్‌ఆర్‌ ఇచ్చాడు.  ముఖ్యంగా ఇంటర్వెల్‌ కి ముందు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌లో తమన్‌ బీజీఎం థియేటర్‌ అదిరిపోయేలా చేసింది.  డీఓపీ విజయ్‌ కన్నన్‌ విజువల్స్‌ రిచ్‌గా వున్నాయి. ఎడారిలో తీసిన సన్నివేశాలు డిఫరెంట్‌ ఎక్‌సఫీరియన్స్‌ ఇస్తాయి.


'ఎవరైనా చదవడంలో మాస్టర్స్‌ చేస్తారేమో, నేను మర్డర్లు చేయడంలో మాస్టర్స్‌ చేశా’..
'వార్నింగ్‌ చచ్చే వాడు కాదు చంపేవాడు ఇవ్వాలి’.
సింహం నక్కల మీదకి వస్తే వార్‌ అవ్వదురా.. ఇట్స్‌ కాల్డ్‌ హంటింగ్‌’'

ఈ డైలాగ్స్‌ సందర్భానుసారంగా కుదిరాయి.
యాక్షన్‌ కొరియోగ్రఫీ ఆకుట్టకుంది. సెకెండాఫ్‌కు కాస్త కత్తెర వేసే పనుంది. సితారా ఎంటర్‌టైన్‌ఎంట్‌ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే దర్శకుడు బాబీ బాలయ్యతో ఎలాంటి బెరుకులేకుండా కంఫర్ట్‌ పని చేశాడనిపించింది. హీరోని చాలా స్టైలిష్‌గా చూపించాడు. అయితే సినిమాలో రొటీన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్నా.. దర్శకుడు కొత్తగా చూపించడంతో ఆ ఫీలింగ్‌ దగ్గరకు రాదు. పండగ సీజన్‌ కాబట్టి అభిమానులకు డబల్‌ పండుగ.


ట్యాగ్‌లైన్‌: బాలయ్య రోరింగ్‌ ఎగైన్‌... 

Updated Date - Jan 12 , 2025 | 03:15 PM