ఆత్మలు అందరికీ ఎందుకు కనిపించవు?

ABN, Publish Date - Mar 18 , 2025 | 02:46 AM

అల్లరి నరేశ్‌ మరో కొత్త సినిమాతో అలరించబోతున్నారు. నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో పేరొందిన డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌..

అల్లరి నరేశ్‌ మరో కొత్త సినిమాతో అలరించబోతున్నారు. నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పొలిమేర, పొలిమేర-2 చిత్రాలతో పేరొందిన డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి ‘12ఏ రైల్వే కాలనీ’ అని టైటిల్‌ పెట్టి టీజర్‌ రిలీజ్‌ చేశారు. అల్లరి నరేశ్‌ ఒక కిటికీ దగ్గర నిలబడి ఆలోచనలో, ధాన్య ముద్రలో కనిపించడంతో టీజర్‌ మొదలవుతుంది. వైవా హర్ష వాయిస్‌ ఓవర్‌లో ‘ఆత్మలు అందరికీ ఎందుకు కనపడవు’ అని ప్రశ్నిస్తుంది. ఈ చిత్రంలో పొలిమేర సిరీస్‌ ఫేమ్‌ డాక్టర్‌ కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటించారు. సినిమాను ఈ వేసవిలో విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది.

Updated Date - Mar 18 , 2025 | 02:46 AM