ఈ తరానికీ నచ్చే చిత్రమిది

ABN, Publish Date - Mar 19 , 2025 | 02:42 AM

బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘ఆదిత్య 369’. ఈ సినిమా అప్పట్లో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. గానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం....

శివలెంక కృష్ణప్రసాద్‌

బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘ఆదిత్య 369’. ఈ సినిమా అప్పట్లో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. గానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్‌ నిర్మించిన ఈ సినిమా రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఏప్రిల్‌ 11న ‘ఆదిత్య 369’ సినిమాను విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నేటి సాంకేతికతకు తగ్గట్లు చిత్రాన్ని ఆధునీకరించాం. విడుదలై 34 ఏళ్లు అవుతున్నా ఈ సినిమాకు ఇప్పటికీ ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. ఇప్పటి తరానికీ గొప్పగా కనెక్ట్‌ అవుతుంది. మా శ్రీదేవి మూవీస్‌ సంస్థకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయడం నందమూరి అభిమానులకే కాదు, తెలుగు ప్రేక్షకులకూ మరిచిపోలేని కానుక’ అన్నారు. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు బాలకృష్ణ. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ను తెరకెక్కిస్తాననీ.. తన తనయడు మోక్షజ్ఞ కథానాయకుడిగా నటిస్తాడనీ బాలకృష్ణ ఓ సందర్భంలో వెల్లడించారు.

Updated Date - Mar 19 , 2025 | 02:42 AM