సికందర్ నుంచి చాలా నేర్చుకోవచ్చు
ABN, Publish Date - Mar 18 , 2025 | 02:44 AM
ఇటీవలె విడుదలైన ‘ఛావా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు హీరోయిన్ రష్మిక మందన్న. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైటిల్‌రోల్‌లో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సికందర్ లో...
ఇటీవలె విడుదలైన ‘ఛావా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు హీరోయిన్ రష్మిక మందన్న. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైటిల్‌రోల్‌లో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సికందర్’లో హీరోయిన్‌గా నటించారు. రంజాన్ సందర్భంగా సినిమా విడుదలవుతోంది. ఇటీవలె ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ‘భం భం భోలే’ను విడుదల చేశారు మేకర్స్. తాజాగా, ఈ పాట బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు రష్మిక. ఇందులో సల్మాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ ఓ నడిచే లైబ్రరీ లాంటివారని.. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు. సెట్‌లో ఆయన ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు.