విలన్ల ప్రేమగీతం

ABN, Publish Date - Apr 11 , 2025 | 06:15 AM

Villains Sing a Unique Love Duet in Police Vari Hechcharika

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన ‘పోలీ్‌స వారి హెచ్చరిక’ చిత్రం నుంచి ఓ వినూత్న ప్రేమగీతాన్ని సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ విడుదల చేశారు. ‘సాధారణంగా హీరోహీరోయిన్లు ప్రేమ గీతాలు పాడుకుంటారు. కానీ ఈ సినిమాలో విలన్లు డ్యూయెట్‌ పాడుకోవడం ఓ వెరైటీ కాన్సెప్ట్‌. ఇలాంటి సరికొత్త పాటను ఆవిష్కరించే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని ఆయన చెప్పారు. సెన్సార్‌ పనులు పూర్తి చేసి త్వరలో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు బాబ్జీ చెప్పారు. త్వరలోనే వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్‌ చేస్తామని నిర్మాత బెల్లి జనార్థన్‌ చెప్పారు.

Updated Date - Apr 11 , 2025 | 06:15 AM