ఎన్ని అబద్ధాలు చెప్పినా మా సినిమా గెలుస్తుంది

ABN, Publish Date - Apr 20 , 2025 | 04:01 AM

‘‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమాను హిట్‌ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు. క్లైమాక్స్‌ కోసం కల్యాణ్‌బాబు తీసుకున్న రిస్క్‌ వల్లే సినిమా ఇంత గొప్పగా వచ్చింది. సినిమాకు నెగెటివ్‌ ప్రచారం చేయడం...

‘‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమాను హిట్‌ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు. క్లైమాక్స్‌ కోసం కల్యాణ్‌బాబు తీసుకున్న రిస్క్‌ వల్లే సినిమా ఇంత గొప్పగా వచ్చింది. సినిమాకు నెగెటివ్‌ ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. దుష్ప్రచారం చేసేవారు దయచేసి మైండ్‌సెట్‌ను మార్చుకోండి. వారు సినిమా బాగాలేదని ఎన్ని అబద్ధాలు చెప్పినా, చివరికి మా సినిమానే గెలుస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాను బ్రతకనివ్వండి. మనస్ఫూర్తిగా సినిమాను దీవించడం నేర్చుకోండి’’ అని నటి విజయశాంతి అన్నారు. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ప్రదీప్‌ చిలుకూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలైంది. సక్సెస్‌ మీట్‌లో కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘కమర్షియల్‌ సినిమాలోనూ కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో దర్శకుడు ప్రదీప్‌ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడు’’ అని చెప్పారు.

Updated Date - Apr 20 , 2025 | 04:01 AM