Tollywood: హవీష్ తో త్రినాథరావు నక్కిన సినిమా
ABN, Publish Date - Apr 28 , 2025 | 03:51 PM
ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రూపుదిద్దుకోబోతోంది. దీనిలో హవీష్ హీరోగా నటించబోతున్నాడు.
ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadharao Nakkina) ఇటీవలే 'చౌర్యపాఠం' (Chowrya Patam) సినిమాతో నిర్మాతగా మారారు. గత శుక్రవారం విడుదలైన ఆ సినిమా వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దు కోవడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. దానికి కొద్ది రోజుల ముందు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన 'మజాకా' (Mazaka) చిత్రం విడుదలైంది. ఇది థియేటర్లలో పెద్దంత సందడి చేయకపోయినా... ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో వీక్షకులను బాగానే అలరించింది. గతంలో త్రినాథరావు నక్కిన ''సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా'' వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ చేశారు. ఏప్రిల్ 27 త్రినాథరావు నక్కిన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది.
యువ కథానాయకుడు హవిష్ (Haveesh) తనదైన పంథాలో వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. అలానే ఆయన తండ్రి కోనేరు సత్యనారాయణ నిర్మించే చిత్రాల నిర్మాణ వ్యవహారాలనూ హవీష్ పర్యవేక్షిస్తుంటాడు. ఇప్పటికే పలు చిత్రాలలో హీరోగా నటించిన హవీష్ తో ఓ స్పెషల్ జానర్ మూవీని త్రినాథ రావు నక్కిన తెరకెక్కించ బోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ భారీ చిత్రం ఉంటుందని, త్వరలో ఇది సెట్స్ పైకి వెళ్ళబోతోని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథను సిద్థం అవుతోందని, యువతను సైతం ఆకట్టుకునేలా ఇది ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్రినాథరావు నక్కిన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన వెలువడటంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపుదిద్దుకునే ఈ క్రేజీ ప్రాజెక్ట్ మంచి విజయాన్ని సాధించాలనే ఆకాంక్షను వీరి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Sharwanand 38: నిన్న అనుపమా.. ఈ రోజు డింపుల్..
Also Read: Shruti Haasan: నేనూ మనిషినే కదా.. కాస్త అర్థం చేసుకోవాలి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి