Vijaya Sri : మహిళలు ముందుకు రావాలి
ABN, Publish Date - Mar 08 , 2025 | 04:29 AM
ఇండస్ట్రీలో ఒకప్పటి కన్నా ఇప్పుడే మహిళలకు అవకాశాలు ఎక్కువ. పాతికేళ్ల ముందైనా, ఇప్పుడైనా మహిళలందరికీ నేను చేప్పే మాట ఒక్కటే.
ఇండస్ట్రీలో ఒకప్పటి కన్నా ఇప్పుడే మహిళలకు అవకాశాలు ఎక్కువ. పాతికేళ్ల ముందైనా, ఇప్పుడైనా మహిళలందరికీ నేను చేప్పే మాట ఒక్కటే. ఇండస్ట్రీలో మీ ప్రతిభను చూపేందుకు ముందుకు రావాలి. తెలుగు రాష్ట్రాల్లో తొలి, దేశంలో రెండో మహిళా సినిమాటోగ్రాఫర్ నేనే. పలు భారతీయ చిత్రాలతో పాటు తెలుగులో రాజశేఖర్ నటించిన ‘విలన్’, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘సుబ్బు’, వడ్డే నవీన్ నటించిన ‘ధనుష్’, విజయశాంతి నటించిన ‘శివాని’.. తదితర సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాను. ఒక్క రోజులోనే తెరకెక్కి.. గిన్నీస్ రికార్డు సాధించిన ‘స్వయంవరం’ అనే తమిళ సినిమాలో భాగమయ్యాను. పాతికేళ్ల నా కెరీర్‌లో నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆగిపోలేదు. నిరాశ పడలేదు. కొత్తగా ఆలోచిస్తా. ప్రయత్నిస్తా. నిరంతరం అప్‌డేట్ అవుతుంటా. బ్లాక్ అండ్ వైట్, కలర్, డిజిటల్.. మూడు తరాలతో పనిచేసిన అనుభవం సంపాదించా.
- విజయ శ్రీ (సినిమాటోగ్రాఫర్ )