హంతకుడి ఆత్మ కథ

ABN, Publish Date - Mar 19 , 2025 | 02:36 AM

సంతోష్‌ కల్వచెర్ల, క్రిషేక పటేల్‌ జంటగా నటించిన చిత్రం కిల్లర్‌ ఆర్టిస్ట్‌. రతన్‌ రిషి దర్శకత్వంలో జేమ్స్‌ వాట్‌ కొమ్ము నిర్మించారు. ఈనెల 21న థియేటర్లలో విడుదల...

సంతోష్‌ కల్వచెర్ల, క్రిషేక పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘కిల్లర్‌ ఆర్టిస్ట్‌’. రతన్‌ రిషి దర్శకత్వంలో జేమ్స్‌ వాట్‌ కొమ్ము నిర్మించారు. ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సంతోష్‌ మాట్లాడుతూ ‘ట్రైలర్‌ను దర్శకుడు బోయపాటి గారికి చూపించాం. బాగుందని ఆయన ప్రశంసించారు. ఓటీటీలో చూడాల్సిన చిత్రం కాదిది. థియేటర్లలోనే చూడాలి. సంగీత దర్శకుడు సురేశ్‌ బొబ్బిలి సినిమాకు ప్రాణం పోశారు. సినిమా విజయవంతమవుతుందన్న నమ్మకం ఉంది’ అని అన్నారు. నిర్మాత జేమ్స్‌ వాట్‌ కొమ్ము మాట్లాడుతూ ‘ఈ సినిమా ఫలితం మీద చాలా మంది భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని చెప్పారు. చిత్ర దర్శకుడు రతన్‌ రిషి మాట్లాడుతూ ‘హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి జీవిత కథ ఇది. ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నాను’ అని తెలిపారు.

Updated Date - Mar 19 , 2025 | 02:36 AM