అదే పౌరుషం.. అదే రోషం..!
ABN, Publish Date - Mar 18 , 2025 | 02:43 AM
నందమూరి కల్యాణ్‌రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు....
నందమూరి కల్యాణ్‌రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ చిత్రం టీజర్‌ను సోమవారం లాంచ్ చేశారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా విజయశాంతి శక్తిమంతమైన పాత్రను పోషించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ ‘చాలా రోజుల తర్వాత యాక్షన్ సన్నివేశాలు చేశాను. ఎలా చేస్తానో అని యూనిట్‌లో కొంతమంది టెన్షన్ పడ్డారు. చాలా సహజంగా నటించాను. ఇలా చేయగలుగుతానని వాళ్లు ఊహించలేదు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ విజయశాంతినే. అదే పౌరుషం..అదే రోషం.. తగ్గేదేలే. ఎంత వయసొచ్చినా ఇంతే స్ట్రాంగ్‌గా ఉంటా’ అని అన్నారు. హీరో నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా మెయిన్ పిల్లర్ అమ్మ(విజయశాంతి). ఈ వయసులో కూడా ఎలాంటి డూప్ లేకుండా అద్భుతమైన స్టంట్స్ చేశారు. మరో 20 ఏళ్ల పాటు ఈ సినిమా గుర్తుండిపోతుంది’ అని అన్నారు. దర్శకుడు ప్రదీప్, నిర్మాత సునీల్ బలుసు, రచయిత శ్రీకాంత్ విస్సా తదితరులు మాట్లాడారు.