అందుకే ఆ టైటిల్ పెట్టాం
ABN, Publish Date - Mar 21 , 2025 | 02:34 AM
సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ఈ మూవీ ట్యాగ్‌లైన్. వైష్ణవి చైతన్య హీరోయిన్...
సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ఈ మూవీ ట్యాగ్‌లైన్. వైష్ణవి చైతన్య హీరోయిన్. బివిఎ్‌సఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కిస్’ పాటను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘ప్రతి మనిషి జీవితంలో ఓ లక్ష్యం ఉంటుంది. అయితే ఏ పని చేస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. ఓ పనిని ఇలానే ఎందుకు చేయాలి.. మరోలా చేస్తానని కొందరు అంటుంటారు. అలాంటి వారిని చూస్తే మనం క్రాక్ అంటాం. అందుకే ఈ టైటిల్ పెట్టాం. ప్రేక్షకులను నవ్విస్తూనే బాధ్యతను నిర్వర్తించే పాత్రలో కనిపిస్తాను’ అని తెలిపారు. హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ ‘ఈ పాట యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’ అని అన్నారు.